భోగిమంటల ధగధగలు ఎమ్మెల్యేలు
పశ్చిమ గోదావరి: దెందులూరు నియోజకవర్గం కొవలి గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం కొవలి గ్రామంలో జరిగిన సంబరాల్లో స్థానిక ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారితో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు. భోగిమంటల ధగధగలు, రంగవల్లుల అందాలు, గాలిపటాలతో ఆటలు, హరిదాసు కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు, మహిళల కోలాట భజనలు, గొబ్బెమ్మల పాటలు, చిన్నారుల సాంస్కృతిక నృత్యాలతో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం కొవలి గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.
స్థానిక ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు హాజరై భోగి మంటలు వెలిగించి సంబరాలు ప్రారంభించారు. సాంస్కృతిక సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ పిండివంటలతో సహపంక్తి భోజనాలు చేసి, సంక్రాంతి సందడిని స్వాగతించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఐఎఫ్ఎస్ నలని మోహన్,బంధువులు, మిత్రులు, ప్రజలు, తదతరులు పాల్గొన్నారు.
మన తాండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ. పైలట్ రోహిత్ రెడ్డి గారి తండ్రి శ్రీ. P. విట్టల్ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కోటరీ అబ్బయ్య చౌదరి గారితో కలిసి కోళ్ల పందెం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తాండూర్ ఎమ్మెల్యే గారి తండ్రి రాకతో అందరు సంతోషం వ్యక్తం చేశారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో జరిగిన సంబరాల్లో స్థానిక ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారితో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు, ఎంపీ పసనూరి దయాకర్ గారు మరియు సీనియర్ నాయకుడు విఠల్ రెడ్డి గారు ప్రజలు, తదతరులు పాల్గొన్నారు.