ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం..రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
- తాండూరు నియోజకవర్గ పరిధిలోని 258 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
- నాణ్యమైన విద్యాబోధన అందించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
తాండూరు : తెలంగాణ రాష్ట్రంలో విద్యా అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విద్యారంగంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు అన్నారు. ఈరోజు తాండూరులోని క్యాంపు కార్యాలయంలో ఈడిసి అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈడిసి ఆధ్వర్యంలో జిన్గుర్తి సమీపంలో నిర్మిస్తున్న పాఠశాల భవనాన్ని త్వరలోనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి నెలాఖరున రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ గారు మరియు సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. తాండూరు నియోజకవర్గ పరిధిలోని 258 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని మండలాల వారీగా నివేదికలు అందజేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఇందులో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అందించడంతో పాటు ప్రైవేటు పాఠశాలల పై ప్రత్యేక దృష్టి పెట్టి ఫీజులు నియంత్రించడం జరుగుతుంది అని అన్నారు.