కరోన అరికట్టడానికి అవగాహన కల్పించిన పోలీస్ కళాబృందం
BHD NewsFebruary 01, 2022
0
కరోన
అరికట్టడానికి అవగాహన కల్పించిన పోలీస్ కళాబృందం
బషీరాబాద్:బషీరాబాద్ మండల కేంద్రంలోవికారాబాద్ జిల్లా SP శ్రీ .N.కోటి రెడ్డి IPS సార్ గారి ఆదేశాల మేరకు మంగళవారం రోజున
బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంగడిబజార్ లో వికారాబాద్ జిల్లా పోలీస్ కళాబృందంవారుకరోన అరికట్టడానికి అవగాహన కల్పించారు.ఈ యొక్క
కార్యక్రమం సాయంత్రం 4:35 నుండి 6
:10 వరకు ఈ
కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంకరోణ బారిన పడకుండా తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి.రోడ్డు భద్రత మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి సెల్ఫోన్ డ్రైవింగ్ గురించి,బ్యాంకింగ్ ఆన్లైన్ మోసాల గురించి.
మహిళలపై జరుగుతున్న నేరాల గురించి, 100 డయల్ మరియుసిటీం 181 గురించి,సీసీ కెమెరాల, కమ్యూనిటీ పోలీసింగ్,మానవ అక్రమ రవాణా 1098, గంజాయి డ్రగ్స్ నిషేధం,155260 వివిధ అంశాలపైన అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో SI విద్య చరణ్ రెడ్డి మాట్లాడుతూఅందరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని
కోరడం జరిగింది.ప్రతి ఒక్కరు కరోణ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని
కోరారు.
రెండు కేసులలో 16 మందికి జరిమానా
రెండు కేసులలో 16 మందికి జరిమానా విదించారు. ఎస్ఐ. విద్యా చరణ్
రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తాండూర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ స్వప్న
మంగళవారం బషీరాబాద్ మండలానికి సంబంధించిన రెండు కేసుల్లో తీర్పు ఇవ్వడం జరిగిందని. మొదటి కేసులో 2016లో అక్రమ ఇసుక కేసులో ఆరు మందికి ఒక్కొక్కరికి చొప్పున మూడు నెలల జైలు శిక్ష
లేదా రూపాయలు 1000 జరిమానా మరియు
ఇద్దరికీ మూడు నెలల జైలుశిక్ష లేదా రూపాయలు 500 జరిమానా.
రెండో కేసులో 2016 లో జరిగిన ఒక గొడవలో కొట్టుకున్న ఎనిమిది
మందికి గాను ఒక్కొక్కరికి చొప్పున రూపాయలు 500 జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష అని కోర్టు తీర్పు ఇవ్వడంతో
శిక్ష పడిన వారు అందరూ మెజిస్ట్రేట్ తీర్పు మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్
రావు ఆధ్వర్యంలో 16 మంది జరిమాన
చెల్లించడం జరిగిందని ఎస్ఐ.విద్యా చరణ్ రెడ్డి తెలిపారు.