గండీడ్ : మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని రంగారెడ్డి పల్లి గ్రామంలో తెలంగాణ వ్యవసాయ వృత్తి దారుల యూనియన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ ఉద్దేశ్యం ఏమిటంటే ఉమ్మడి గండీడ్ మండలంలో TRS ప్రభుత్వం ఇస్తున్న దళిత బందు స్కీము గందరగోళంగా తయ్యార్ అయింది. దళిత బంధు ఆర్థికంగా అభివృద్ధి చెందినTRS కార్యకర్తల కుటుంబాలకు మాత్రమే ఇస్తున్నారు.
దళిత బందు పథకం ఇల్లు, భూమి లేనటువంటి కుటుంబాలకు ఇయ్యలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని ఉమ్మడి గండీడ్ మండల వ్యవసాయ వృత్తి దారుల యూనియన్ సంఘం తరుపున డిమాండ్ చేస్తున్నాము. కార్యక్రమంలో వ్యవసాయ వృత్తి దారుల యూనియన్ మండల అధ్యక్షుడు కప్లాపూర్ ఆశన్న, ప్రధాన కార్యదర్శి బద్ధుల రాజు, కుందేటి కిష్టన్న, నర్సింలు, దస్తయ్య, కృష్ణంరాజు, బసప్ప, ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.