కిరోసిన్ తో నిప్పంటించుకుని యువకుడు
ఆత్మహత్య
బషీరాబాద్ : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని గోసాయి గల్లి కి చెందిన బందెప్ప గౌడ్ రెండవ
కుమారుడు బసవరాజ్ (18) వారి ఇంట్లో ఒంటిపై కిరోసిన్ తో నిప్పంటించుకొని మృతి
చెందాడు. ఎస్ ఐ.విద్యా చరణ్ రెడ్డి
తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన బస్వరాజ్ అనే యువకుడు స్థానిక
అశ్విని జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్నాడు. కళాశాలకు
సక్రమంగా వెళ్లకపోవడం, తరచూ సెల్ ఫోన్ వాడటం తో
తండ్రి యువకుడిని మందలించడం జరిగిందని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు
ఇంట్లో ఎవరూ లేని సమయంలో బస్వరాజ్ కిరోసిన్ తో ఒంటికి నిప్పంటించుకోవడంతో
స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో తల్లిదండ్రులు తాండూరులో ఆసుపత్రికి
తరలించారు అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి
తరలించడంతో రాత్రి సుమారు 12 గంటలకు బసవరాజు మృతి చెందాడు.
మృతుడి తండ్రి ఫిర్యాదు
మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై. విద్యా చరణ్ రెడ్డి
పేర్కొన్నారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం
జరిగిందని పోలీసులు తెలిపారు. బస్వరాజ్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కూడా కారణం ఉండవచ్చు అని సమాచారం.