డ్రగ్స్, గంజాయి నిర్మూలన పై అవగాహన కార్యక్రమం
-గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తుపదార్థాల నిర్మూలన -ప్రతి ఒక్కరు మత్తుపదార్థాల నిర్మూలనకు కృషి చేయాలి
-తాండూరు రూరల్ సీఐ జలంధర్ రెడ్డి
బషీరాబాద్ : వికారాబాద్
జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో స్థానిక ఎస్ఐ. విద్యా
చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో మండల అధికారులతో అదేవిధంగా మండలం లోని సమస్త సర్పంచులు,
ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులతో కలిసి డ్రగ్స్, గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం
నిర్వహించారు.
అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తాండూర్ రూరల్ సీఐ. జలంధర్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ మాదకద్రవ్యాల నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ ఆదేశాల మేరకు మారక ద్రవ్యాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని, అలవాటు కొంచెం వ్యసనంగా మారి కొందరు యువకులు ప్రాణాలు కోల్పోయారని బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్న మారక ద్రవ్యాలను క్షేత్రస్థాయిలో అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

గ్రామాలలోని రైతులు ఎవరైనా గాంజా మరియు ఇతర మాదక ద్రవ్యాలను
నిల్వచేసి ఉంచినా రవాణా చేసిన లేదా పండించిన స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం
అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రమేష్ కుమార్, ఎక్సైజ్ శాఖ అధికారి సైదప్ప, ఉప తహశిల్దార్ వీరేష్ బాబు, జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, పోలీసు సిబ్బంది, వివిధ గ్రామాల
సర్పంచులు ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు
పాల్గొన్నారు.
Good sir
ReplyDeleteManchidi sir
ReplyDelete