Type Here to Get Search Results !

Sports Ad

కేసిఅర్ కు మతి బ్రమిచ్చిందా?

 

కేసిఅర్ కు మతి బ్రమిచ్చిందా?
  • దళిత బహుజనులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి
  • ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బోరు కృష్ణయ్య
మహబూబ్ నగర్ : భారత రాజ్యాంగంని మార్చాలన్న కేసిఆర్ వెంటనే భేషరతుగా క్షమాపణ చెప్పాలని అంబెడ్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు బోరు కృష్ణయ్య డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా బోరు కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఆర్టికల్ 3 ద్వారానే వచ్చిందని మర్చి పోయావా కేసిఅర్ లేక మతి బ్రమిచ్చిందని ప్రశ్నించారు. మరొకవైపు, భారతదేశంలోమనుషుల తలరాతలను మార్చే శక్తి ఒక రాజ్యాంగానికి మాత్రమే ఉందని పేర్కొన్నారు.అదేవిధంగా ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శంగా నిలిచిందని చెప్పాలి.

      రాజ్యాంగము ప్రజలకు కల్పించిన హక్కులను కాలరాస్తూ ముఖ్యమంత్రి KCRనియంత పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. 75 ఏళ్ల కింద రాసుకున్న రాజ్యాంగం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం లేదని, అందుకే వాళ్ల ఆకాంక్షల మేరకు కొత్త రాజ్యాంగం రావాలని సి ఎం కేసిఅర్ పేర్కొనడం సమంజసం కాదని అన్నారు.రాజ్యాంగాన్ని మర్చాలంటూ కేసిఆర్ పెర్కొనడo అంబేద్కర్ ను మరియు దళిత బహుజనల మనోభావాలు దెబ్బ తినే విదంగా అవమానించడమేనని అన్నారు.

           ఇప్పటికైనా కేసీఆర్ అన్న మాటలను వెనక్కి తీసుకుని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని అంబేద్కర్ సంఘం జిల్లా కమిటీ తరపున డిమాండ్ చేశారు. లెనిచో అంబేద్కర్ సంఘం మరియు బహుజన ప్రజసంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా పెద్ద ఎత్తునా ఆందోళన చేస్తాము అని హెచ్చరించారు. 
           కార్యక్రమంలో DSP మండల అధ్యక్షుడు పసుల శ్రీనివాస్, BSP మండల అధ్యక్షుడు కృష్ణంరాజు,  స్వేరో సర్కిల్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్, జిల్లా స్వేరో సర్కిల్ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, మల్కయ్య,గోపికృష్ణ, అజయ్, ఆనంద్, డి. శ్రీనివాస్, నితిన్,బుగ్గయ్య, హన్మంత్,ప్రవీణ్, వెంకటేష్,భీమయ్య, శంకర్,తదితరులు పాల్గొన్నారు.

కెసిఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

బషీరాబాద్ : యావత్ దేశ దళిత ప్రజలకు  కెసిఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని MRPS,MSP డిమాండ్ చేయడం జరిగింది.బషీరాబాద్ మండల్ ఇన్చార్జి .బీ .కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేయడం జరిగింది ముందస్తుగా అరెస్టు చేసిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు బేసి యాత్ర గా విడుదల చేయాలని మాట్లాడడం జరిగింది ఇందులో పాల్గొన్న ఎం ఎస్ ఎఫ్ విద్యార్థి నాయకులు ప్రకాష్ మాదిగ, బస్వరజ్,వెంకటేష్,శమప్ప,శమ్,రావి,పాల్కొనారు.

 


Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies