అగ్గనూరు ZPHS పాఠశాలలో ఉపాధ్యాయుడి పై దాడి
- ప్రవీణ్ కుమార్
ఉపాధ్యాయుడి పై దాడి చేసిన జోగు రమేష్ ను కఠినంగా శిక్షించాలి
- ప్రజా సంఘాల
డిమాండ్
- ఎంత కాలం ఉపాధ్యాయులపై
దాడి మొన్న మైల్వార్లో,ఈ రోజు అగ్గానుర్ లో రేపు ప్రతి పాఠశాలలో అన్యాయాని
అరికట్టాలేమా?
- ఉపాధ్యాయుల మధ్య మానవత్వం
లేని క్రూరులు కృరులు
యాలాల : ప్రజాసంఘాల ఆధ్వర్యంలో యాలాల పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఈ సందర్బంగా ప్రజాసంఘాల నాయకులు ఉప్పలి మల్కయ్య,శ్రీనివాస్ గార్లు మాట్లాడుతూ తాండూర్ నుండి అగ్గనూరు ZPHS పాఠశాలకు విధులు నిర్వహించడానికి బైక్ పై వెళ్తున్న ప్రవీణ్ కుమార్ ఉపాధ్యాయుడిని ఆకరణంగా దౌర్జన్యం చేసి పిడిగుడ్డులు గుద్ది చంపుతా అని బెదిరింపులు గురి చేసి దాడి చేసిన వ్యక్తి పై చట్టపరం అయినా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమాజంలో మనిషిని మనిషి కొట్టడం చట్ట విరుద్ధం అని ఎవరు కూడ చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోవరదని, ఉపాధ్యాయుడి పై దాడి చేసిన జోగు రమేష్ పై చట్ట పరం అయినా చర్యలు తీసుకొని జైలుకు పంపాలని ప్రభుత్వంని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్,బీసీ సంఘం బషీరబాధ్ మండల అధ్యక్షులు నరేందర్.
తాండూర్ మండలం బీసీ సంఘం అధ్యక్షులు బసంత్, పెద్దేముల్ మండలం బీసీ సంఘం అధ్యక్షులు బాలు,బీసీ సంఘం నాయకులు గడ్డం వెంకటేష్, బీజేపీ నాయకులు రజినీకాంత్, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల నర్సిములు జంటిపల్లి వెంకటేష్, దళిత నాయకులు ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.