ప్రతి ఒక్కరు దైవ చింత కలిగి ఉండాలి MLA రోహిత్ రెడ్డి
- జిన్గుర్తి రామలింగేశ్వర దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
- శివరాత్రి పర్వదినం సందర్భంగా తదితర దేవాలయాలను దర్శించుకునారు
తాండూరు : తాండూరు మండలం జిన్గుర్తి రామలింగేశ్వర దేవాలయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయానికి పుజలు చేసి అనంతరం నూతన ఆలయ కమిటీని అభినందించి సన్మానించారు. ఆలయ అభవృద్ధికి కృషి చేయాలని ఆయన అన్నారు. ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యే ను సన్మానించి ధన్యావాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరు దైవ చింత కలిగి ఉండాలని కోరారు.
తాండూరు పట్టణంలోని చెరువెంటి ఈస్వరాలయం, నగ్రేశ్వర్ ఆలయం, బద్రప్ప గుడి, కోటేశ్వర దేవాలయం, పోట్లి మహరాజ్ తదితర దేవాలయాలను దర్శించుకుని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి అభిషేకం, పుష్పార్చన నిర్వహించారు.
శివరాత్రి పర్వదినం సందర్భంగా తాండూరు మండలం అంతారం భూకైలాష్ దేవస్థానంలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పలువురు సీనియర్ నాయకులు నర్సింలు, రాజు గౌడ్, శ్రీనివాస్ చారి, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ వెంకట రెడ్డి, తాండూర్ మండల పార్టీ అధ్యక్షుడు రామదాస్, రైతుబంధు అధ్యక్షుడు రామలింగారెడ్డి, ఎంపీటీసీ సాయి రెడ్డి, నాయకులు ఉమాశంకర్, హరిగౌడ్, డైరెక్టర్ ఆశన్న, ఆలయ కమిటీ చైర్మన్ ప్రవీణ్ గౌడ్ తదతరులు ఉన్నారు.