డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందరికి స్ఫూర్తి
- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మహానీయుడు
- రూ.74 కోట్లతో పాత తాండూరు రైల్వే గేట్ పై రోడ్డు ఓవర్ బ్రిడ్జి, పనులకు ఆర్థిక శాఖ అనుమతులు
- పాత తాండూరులో అర్బన్ హెల్త్ సెంటర్ తో పాటు, కమ్యూనిటీ హాల్
- దేశానికి దిక్సూచి దళిత బంధు ,సామాజిక మార్పు కోసమే పథకం అమలు
- లబ్ధిదారులు యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలి,
- విడతల వారీగా అందరికీ దళిత బంధు. - ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూర్ : తాండూర్ పట్టణంలో అంబేద్కర్ 131 జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం, మున్సిపల్ పరిధి పాత తాండూరు అంబేద్కర్ పార్కులోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా పాత తాండూరు వాసులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సహకారంతో రూ.74 కోట్లతో పాత తాండూరు రైల్వే గేట్ పై రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మించడం జరుగుతుందని అందుకోసం పనులకు ఆర్థిక శాఖ అనుమతులు కూడా లభించాయని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు అన్నారు.
అదే విధంగా పాత తాండూరులో అర్బన్ హెల్త్ సెంటర్ తోపాటు కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన మహానీయుడని అంబేద్కర్ అని అభివర్ణించారు. రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందరికి స్ఫూర్తి ప్రధాతగా నిలిచారని ఆయన కన్న కలలను నిజం చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని చెప్పారు.
దేశానికి దిక్సూచి దళిత బంధు పథకం అని సామాజిక మార్పు కోసమే పథకం అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు అన్నారు. గురువారం రోజున యాలాల మండల కేంద్రంలో దళిత బంధు పథకం ద్వారా పలు యూనిట్లు అందుకున్న లబ్దిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేసి వారితో ముచ్చటించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ను వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాగుప్త, మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ విఠల్ నాయక్, వెంకట్ రెడ్డి, డైరెక్టర్ అషన్న, వైస్ ఎంపీపీ రమేష్, కో ఆప్షన్ సభ్యుడు అక్బర్ బాబా, మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.