దళితుల సాధికారత కోసమే దళిత బంధు పథకం
తాండూర్ : దళితుల
సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పథకం
దళిత బంధుపథకమని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు
కార్యాలయంలో అడ్కిచెర్ల గ్రామానికి చెందిన రేవంత్ కు దళిత బంధు పథకం ద్వారా
మంజూరైన గూడ్స్ ఆటోను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే
పైలెట్ రోహిత్ రెడ్డి గారు మాట్లాడుతూ అర్హులైన దళితులకు ఈ పథకంలో భాగంగా
కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయబడుతుందన్నారు. తమ
అభివృద్ధిని తామే నిర్వచించుకునే దిశగా చైతన్యమై, ఉత్పత్తిలో
భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందన్న ఉద్దేశ్యంతో
తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసిందన్నారు. పరిశ్రమలను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకుని దళిత సమాజం వ్యాపారపారంగా అభివృద్ధి
చెందడం కోసం ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు.ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోలన్నారు.