కొంగుబంగారం ఎల్లమ్మ తల్లి సేవలో ఎమ్మెల్యే తల్లి
- వికారాబాద్ జడ్పిటిసి ప్రమోదిని దేవీ
- కోరికలు తీర్చే కొంగుబంగారం ఎల్లమ్మ తల్లి
- మహిమాన్విత దేవాలయం కోత్లాపూర్ ఎల్లమ్మ దేవాలయం
తాండూరు :
ఈ సందర్భంగా వికారాబాద్ జడ్పిటిసి ప్రమోదిని దేవీ మాట్లాడుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా రేణుక ఎల్లమ్మ తల్లి విశేష పూజలు అందుకుంటుందన్నారు. తాండూరు నియోజకవర్గం నుండి కాకుండా కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి భక్తులు వస్తుంటారన్నారు.
ప్రతి సంవత్సరం ఎంతో వైబోవంగా ఈ జాతర ఉత్సవాలు జరుగుతుంటాయన్నారు. ఈ యొక్క కార్యక్రమలలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీ లా ఫోరం అధ్యక్షులు సాయిరెడ్డి , తాండూర్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ దీపా నర్సింలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రామలింగ రెడ్డి ,EO శేఖర్ గౌడ్, సర్పంచ్ సాయిలు, చేగోల్ సర్పంచ్ మలేశ్వరి, సీనియర్ నాయకులు నర్సిరెడ్డి పటేల్, ఉమా శంకర్ ,మహిళా నాయకురాలు శకుంతల, గోపాల్ గుడి చేర్మన్ సందీప్ రెడ్డి, k సురేష్ ,b అనాన్నతప్ప , విట్టల్ రెడ్డి, దళం అధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి, టైలర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.