ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలి
తాండూర్ : ఆర్య వైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. 2022-24 సంవత్సరానికిగాను నూతన అధ్యక్ష కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం నిర్వహించారు. వాసవి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు కట్కం వీరేందర్, ఉపాధ్యక్షులు అలంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కోట మురళి కృష్ణ, ఉపకార్యదర్శి దాదాపురం రవీందర్, కోశాధికారి రొంపల్లీ సంతోష్ కుమార్, కార్యవర్గ సభ్యులను ఎన్నికల అధికారి శివకుమార్ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు.
ఎమ్మెల్యే పైలట్
రోహిత్ రెడ్డి గారు మాట్లాడుతూ సేవ చేసే
తత్వంలో ఆర్యవైశ్యులకు ముందుంటారని కొనియాడారు.ఆర్య వైశ్యులు
అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. తాండూరు
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు
ప్రతి ఒక్కరూ సేవతత్వం అలవర్చుకోవాలని పేర్కొన్నారు. నూతన అధ్యక్ష
కార్యవర్గ సభ్యులకు ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు నూతన కార్యవర్గ
సభ్యులకు ఘనంగా శాలువా పూలమాలతో సన్మానించిరు.