* ప్రజా సంక్షేమంకై తెరాస లో చేరిక
* మంత్రి తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరిక
* సింధూజ నరేందర్ గౌడ్ మరియు నరేందర్ గౌడ్,
తాండూరు : తాండూర్ నియోజకవర్గం నుండి ప్రజా సంక్షేమంను దృష్టిలో పెట్టుకొని తెరాసలో చేరినట్లు బీజేపీకి రాజీనామా చేసిన మున్సిపల్ కౌన్సిలర్ సింధూజ నరేందర్ గౌడ్ ఆమె భర్త నరేందర్ గౌడ్ తెలిపారు.గురువారం రోజున తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో నరేందర్ గౌడ్ దంపతులు తెరాస లో చేరారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో కలిసి వెళ్లి తెరాసలో చేరారు. బీజేపీకి రాజీనామా చేసి తెరాసలో చేరిన నరేందర్ గౌడ్ దంపతులకు మంచి భవిష్యత్తు కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
కేటీఆర్ సమక్షంలో సిపిఐ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ అసిఫ్ కూడా తెరాసలో చేరారు. తెరాసలో చేరిన నరేందర్ గౌడ్ దంపతులతో పాటు మునిసిపల్ ఫ్లోర్ లీడర్ అసిఫ్ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సూచించారు.అంతకు ముందు సింధూజ నరేందర్ గౌడ్ దంపతులు బీజేపీ ప్రాథమిక సభ్యత్వంకు, అసిఫ్ సిపిఐ పార్టీ కి రాజీనామా చేశారు.
తెరాసలో చేరిన నరేందర్ గౌడ్
దంపతులతో పాటు సిపిఐ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ అసిఫ్ ను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
అభినందించారు.ఈ కార్యక్రమంలో
మునిసిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, తెరాస నేతలు రాజు గౌడ్, నర్సింలు, వెంకట్ రెడ్డి, పట్టణ తెరాస ప్రెసిడెంట్
నయీమ్, మునిసిపల్
కౌన్సిలర్ మంకల్ రఘు,సోషల్
మీడియా ఇంచార్జి ఇంటియాజ్ తెరాస నాయకులు తదితరులు పాల్కొన్నారు.