తాండూర్ పట్టానని అభివృధి చేయడమే లక్ష్యం MLA PRR
* పాత తాండూరు రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి రూ.74 కోట్లు మంజూరు
* నామ్కేవాస్తేగా గతంలో ప్రతిపాదనలు ఇగో అయిపోయింది అంటూ ప్రగల్బాలు
* త్వరలో కేటీఆర్ గారి చేతుల మీదగా శంకుస్థాపన
తాండూర్ : తాండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూర్ పట్టానని అభివృధి చేయడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు.గురువారం రోజున పాత తాండూరు రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి రూ.74 కోట్లు మంజూరు చేస్తూనట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జరి చేసింది. ఎన్నో సంవత్సరలుగా జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తునారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారికి ఉత్తర్వులు అందజేసిన ఉన్నతాధికారులు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కృషితో పాత తాండూరు వాసుల సహకారంతో దశాబ్దాల కల నెరవేరింది. గతంలో ప్రతి ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలకే పరిమితమైన ప్రజా ప్రతినిధులు, బ్రిడ్జి నిర్మాణానికి చొరవ చూపని వైనం.
నాంపల్లి, సికింద్రాబాద్ నుండి వికారాబాద్ మీదుగా ముంబై, బెంగళూరు, ఔరంగాబాద్, మన్మాడ్, షిరిడీ, బీదర్, జహీరాబాద్ వైపు రైళ్ల రాకపోకలు, 10 నిమిషాలకు ఒకసారి గేట్ పడుతుండటంతో రాకపోకలకు వాహనదారుల ఎన్నో ఇక్కట్లు పడుతుండేవారు. గతంలో నామ్కేవాస్తేగా ప్రతిపాదనలు ఇగో అయిపోయింది బ్రిడ్జ్ అంటూ ప్రగల్బాలు పలికారు కానీ ఏమి ప్రయోజనం లేకపోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్యులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి గార్ల సహకారంతో ఢిల్లీ వెళ్లి అనేకమార్లు ఉన్నతాధికారులను కలిసి బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించుకున్న తెలిపారు. త్వరలో కేటీఆర్ గారి చేతుల మీదగా శంకుస్థాపన చేపిస్తామన్నారు. తాండూరు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.