Type Here to Get Search Results !

Sports Ad

రైతుల భూములు గుంజుకోవడాన్ని విరమించాలి

 

రైతుల భూములు గుంజుకోవడాన్ని విరమించాలి  

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం స్టేట్ సెక్రటరీ జనరల్ కట్టెల మల్లేశం

తాండూరు : తాండూరు మండలంలోని జినుగుర్తి, అంతారం, కోకట్ గ్రామాలలో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో రైతుల వద్ద భూములు గుంజుకునే కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం స్టేట్ సెక్రటరీ జనరల్ కట్టెల మల్లేశం డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తాండూరు మండల తహసిల్దార్ కార్యాలయం ముందు బాధిత రైతులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ఉన్న భూములు గుంజుకుంటుందని విమర్శించారు.

 ఈ గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన రైతులు గత 50 సంవత్సరాలుగా ఈ భూములపైనే ఆధారపడి బతుకుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇప్పుడు ఈ భూములు తీసుకోవడం వల్ల వాళ్లు జీవితాన్ని కోల్పోయి రోడ్డు పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. తాండూరు పట్టణాన్ని కాలుష్యరహితంగా మార్చేందుకు నాపరాతి పరిశ్రమను జినుగుర్తి గ్రామానికి తరలించేందుకు తీసుకుంటున్న చర్యలు సరైనవి కావని అన్నారు. జినుగుర్తిలో 18 కోట్ల వ్యయంతో మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల, ఐటిఐ కాలేజీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, ఆదర్శ పాఠశాలలు ఉన్నాయని, అక్కడ నాపరాతి పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థుల జీవితాలు అగమ్య గోచరంగా మారుతాయి అని అన్నారు. 

ఈ విద్యాసంస్థలన్నీ కాలుష్యంతో నిండిపోతాయని, దీని ద్వారా విద్యార్థుల చదువులు సజావుగా సాగేందుకు వీలు లేకుండా మారుతుంది అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జినుగుర్తి గ్రామంలో 84 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయి అన్నారు. కావున వెంటనే ప్రభుత్వం భూసేకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని,  64, 65, 66 జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు భూమి దక్కేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. 

పెద్దెముల్ జెడ్పిటిసి ధారాసింగ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, దళిత హక్కుల పోరాట సమితి నాయకుడు బుడగ జంగం వెంకటేష్ రైతులకు మద్దతుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు కాశప్ప, మాణిక్యం, అంజిలప్ప, రవీందర్ నాయక్, మాణప్ప, బాలరాజు, వడ్డే అనంతప్ప, చాకలి మల్లప్ప, వడ్డే హన్మప్ప, పి.నర్సింలు, జయమ్మ, కళావతి, వడ్డే దేవమ్మ, బొంకూరు పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies