బిసి భవననికి స్థలం పరిశీలన చేసిన ఎమ్మెల్యే
- బిసి భవన్ కు స్థలం పరిశీలన
- త్వరలో పనులను ప్రారంభిస్తాం
- తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు: తాండూరు ప్రాంతంలో అధిక సంఖ్యలో ఉన్న బిసి సామాజిక వర్గం కొరకు తాండూరులో బిసి సమీకృత భవనం చాలా అవసరం అని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. బిసి సమీకృత భవన్ ను నిర్మించాలని చాలా కాలంగా బిసి సంక్షేమ సంఘం నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని గుర్తుచేశారు. పార్టీకి చెందిన బిసి నేతలు సైతం తాండూరులో బిసి భవన్ అవసరంను అనునిత్యం గుర్తుచేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా తాండూరులో బిసి సమీకృత భవన్ నిర్మాణంకు చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు.
ఆదివారం పార్టీ నేతలు విశ్వనాథ్ గౌడ్, సాయిపూర్ నర్సింలు, రాజుగౌడ్, శ్రీనివాసచారీ లతో పాటు బిసి సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్, షుకూర్ లతో కలిసి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బిసి సమీకృత భవన్ నిర్మాణంకు భూమిని పరిశీలించారు. హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతాశిశు ఆసుపత్రి వెనుక భాగంలో ఉన్న భూమి బిసి సమీకృత భవన్ నిర్మాణంకు అనువైనదిగా పార్టీకి చెందిన నేతలతో పాటు బిసి సంక్షేమ సంఘం నేతలు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దృష్టికి తీసుకవచ్చారు.
రెవెన్యూ అధికారులతో మాట్లాడి వెంటనే బిసి
సమీకృత భవన్ కు భూమిని కేటాయించేలా చూడాలని పార్టీ నేతలు సాయిపూర్ నర్సింలు,
రాజుగౌడ్ లకు ఎమ్మెల్యే
రోహిత్ రెడ్డి సూచించారు. త్వరలో బిసి భవన్ పనులను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే
తెలిపారు. తాండూరులో బిసి సమీకృత భవన్ నిర్మాణంకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
చూపిస్తున్న చొరవపై బిసి సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ రాజ్ కుమార్ సంతోషం
వ్యక్తం చేశారు.