ధన్యవాదాలు
- బషీరాబాద్ మండల కేంద్రనికి అభివృద్ధి పనులకు సహకారిస్తున...
- ప్రతి వార్డు సభ్యునికి మూడు లక్షలు అభివృద్ధి పనులు
- వార్డు సభ్యులు సిద్ధార్థ మదినే
బషీరాబాద్ : మూడు నెలల క్రితం బషీరాబాద్ సర్పంచ్, ఉప సర్పంచ్ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.ఉప సర్పంచ్ స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశానుసారం చెక్ పవర్ నిమిత్తం వార్డు సభ్యులు అందరూ కలిసి సిద్ధార్థ మద్దినేకు ఎన్నుకోవడంతో ఉన్నతాధికారులు నియమించారు.
గురువారం ఎంపీడీవో ఆధ్వర్యంలో స్థానిక గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా జాయింట్ చెక్ పవర్గా నియమించిన వార్డు సభ్యులు సిద్ధార్థ మదినే మాట్లాడుతూ మూడు నెలల నుండి గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు లేక గ్రామపంచాయతీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి ముందుగా గ్రామ సభలో గ్రామపంచాయతీ కార్మికుల జీతాల నిమిత్తం తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు.
అదేవిధంగా ఎన్నికలు జరిగినప్పటి నుండి వార్డు సభ్యులకు ఎవరూ పట్టించుకోవడంలేదని వారి వార్డులలో ఉన్న సమస్యలను ఎవరు పరిష్కరించలేదని వార్డు సభ్యుల సమస్యను పరిష్కరించాలని ఉద్దేశంతో ప్రతి వార్డు సభ్యునికి 3లక్షల అభివృద్ధి పనులకు తీర్మానం చేయడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా త్రాగునీటి బోర్లు మరియు రిపేర్లు మరియు మురుగు కాలువల నిమిత్తం తీర్మానాలు చేయడం జరిగిందని మొత్తం దాదాపు 50లక్షల అభివృద్ధి పనులకు తీర్మానం చేయడం జరిగిందని అన్నారు.మాజీ శాసనసభ్యులు నారాయణరావు ఆదేశాల మేరకు వారి సహాయంతో ప్రతి వార్డు సభ్యునికి 3 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల తీర్మానాలు అందజేయడం జరిగిందని అన్నారు.
ఇంకా మాజీ శాసనసభ్యులు నారాయణరావు మరియు స్థానిక శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి సహాయంతో మరిన్ని నిధులు మంజూరు చేసి బషీరాబాద్ ని అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు .అనంతరం వార్డు సభ్యులు సిద్ధార్థ మదినేకు గ్రామపంచాయతీ కార్మికులు మరియు వార్డు సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ, ఎంపీటీసీ రేఖ పవన్ ఠాకూర్, మండల కో ఆప్షన్ రజాక్ ,వార్డు సభ్యులు రాజన్న ,విష్ణు, రాజు ,అంబిక, అంజిలమ్మ ,ఆర్థిక్ ,ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.