దళితబంధు దళారుల పరం చేయొద్దు
- అధికారుల ద్వారా అర్హులకే అమలు చేయాలి
- తాండూర్ RDO ఆఫీసు వద్ద KVPS ఆధ్వర్యంలో ధర్నా
- KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి R మైపాల్, ఉపాధ్యక్షులు ఉప్పలి మల్కయ్య
తాండూర్ : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో దళితులoదరికీ దళిత బందు ఇస్తామని రాష్ట్ర సీఎం చెప్పి ఏడాది పూర్తయిందని అర్హులకు కాకుండా ఈ పథకం దళారుల పరం అవుతుందని గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలని KVPS జిల్లా ప్రధాన కార్యదర్శ R మహిపాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం రోజున తాండూర్ RDO కార్యాలయం ఎదుట KVPS ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.తాండూర్ నియోజకవర్గం లోని పలుగ్రామాల నుండి దళితులు తరలివచ్చారు.ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరైన KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి R మహిపాల్, జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడితే కాపలా కుక్కగా ఉంటానని ఇంటికొక ఉద్యోగం ఇస్తానని ప్రతి పేదవారికి మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేసి ఎనిమిది సంవత్సరాలు అయిందన్నారు.దళిత బంధు అర్హుల ఎంపిక మంత్రి క్యాంపు ఆఫీసుల్లో అనుయాయులకు కాకుండా గ్రామ సభలు పెట్టి అర్హులకు ఇవ్వాలన్నారు.
స్వాతంత్య్రం తర్వాత రాజకీయ నాయకులు ఎంపిక చేయడం ఇదే మొదటి సారి అని ప్రతి పథకం ప్రభుత్వ అధికారుల ద్వారా అమలు చేయబడిందన్నారు. మండలంలోని ప్రతీ దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలన్నారు దళిత బంధులో రాజకీయ జోక్యం అరికట్టలన్నారు.పారదర్శకంగా ప్రజాస్వామ్యయుతంగా ఇవ్వాలన్నారు.
గతంలో నియోజకవర్గానికి 100చొప్పున వస్తే గ్రామ దళితులకు తెలియకుండా అడ్డగోలుగా అనుయాయులు పంచుకున్నారని చెప్పారు. 2444కోట్ల రూపాయాలు విడుదల చేశామని చెబుతున్న ప్రభుత్వం అర్హులకే ఆ నిధులు చెందలన్నారు దళిత బంధు దళారుల బంధు కావొద్దన్నారు. దళిత బంధు ప్రతి దళిత కుటుంబానికి వచ్చే వరకు దళితులను ఐక్యం చేసి పోరాడుతామని చెప్పారు.
ఈ ధర్నా కార్యాక్రమములో మద్దతుగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులుశ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు బుగ్గప్ప ప్రసంగిస్తూ మండలంలోని నిరుద్యోగులుగా చాలామంది ఉపాదిలేక ఇబ్బందులు పడుతున్నారని వారిని గుర్తించి దళితబంధు మంజూరి చేయాలన్నారు. సీఐటీయూ,వ్యవసాయ కార్మిక సంఘం దళితుల సమస్యలపై సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.ఈ కార్యక్రమములో KVPS జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పలి మల్కయ్య,KVPS నాయకులు సురేష్,బసప్ప,రాజు,గోపాల్,మహేష్, సతీష్,DJ బాలరాజ్, నరేందర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.