గ్రూపు -1 ప్రాథమిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు కలెక్టర్
వికారాబాద్ : తెలంగాణలో ఈ నెల 16 వ తేదీన అనగా రేపు జరిగే టీఎస్ గ్రూప్ -1 ప్రాథమిక పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1019కేంద్రాల్లో 3.8లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నందున లోటు పాట్లు లేకుండా పరీక్ష నిర్వహించాలన్నారు.శుక్రవారం రోజున సమావేశంలో జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 14 పరీక్షా కేంద్రాల్లో 457 మంది పరీక్షకు హాజరుకానున్నారు.బయో మెట్రిక్ ద్వార ఎంట్రీ ఉన్నందున ఉదయం 8:00 గంటలకే నుంచి పరీక్షా కేంద్రాలు లోపలికి అనుమతి చేసి ఉదయం 10:15 నిమిషాల వరకు లోపలికి పంపిస్తారు.హాల్ టికెట్ తో పటు ప్రభుత్వ గుర్తింపు కార్డులతో పాన్ కార్డు,ఓటర్ కార్డు,డ్రైవింగ్ లైసెన్స్,ఆధార్ కార్డు ఏదైనా ఒకటి తీసుకొని రావాలని సూచించారు.పరీక్షా కేంద్రానికి కావలసిన నియమ నిబ్బంధనలను వివరిస్తూ పరీక్షలను ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించాలి అని తెలిపారు.