ఉత్సహంగా జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చంపియన్షిప్
* సుమారు 350 మంది అథ్లెట్లులో పాల్కొన్నారు
* గెలుపొందిన వారికీ బహుమతులు
బద్రాద్రి కొత్తగుడెం : బద్రాద్రి కొత్తగుడెం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అద్వర్యంలో పాల్వంచ ,తెలంగాణ సొషల్ వెల్ఫేరె రెసిడెంటల్ కాలేజీ గ్రౌండ్స్ నందు జిల్లా జానియర్ అథ్లెటిక్స్ చంపియన్షిప్ ను సోమవారం రోజున ఉదయం లక్ష్మీదేవి పల్లి గురుకుల కళాశాలలో గేమ్స్,కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె.వెంకటేస్వరరావు వైస్ ప్రిన్సిపల్ రామకృష్ణ జండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్బముగా స్పోర్ట్స్ మీట్ ఈ గ్రైండ్ లో నిర్వహించటం ద్వరా చాలా మంది క్రిడాకారులు అభివృద్ది చెందుతారని తెలిపారు .అనంతరము జరిగిన బహుమతి ప్రధానిస్తావ్ కార్యక్రమానికి తెరాస నాయకుడు వనమా రాఘవ పోటిలలో గెలుపొందరు.క్రిడాకారులను మెడల్స్ మరియు మెరిట్ సర్టిఫికెట్లు బహుకరించారు.ఈ సందర్బముగా అయన మాట్లడుతూ క్రిడాకారుల రాష్ట్ర ,జాతియ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు తేవాలని వారికి తనవంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమములో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెశిడెంట్ ఈ.మొగిలి,జాయింట్ సెక్రటరి పి.కసిహుస్సన్ ,కోశాధికారి రాజెందర్ ప్రసాద్ పల్గున్నారు .జిల్లా నలుమూలల నుండి షుమారు 350 మంది అథ్లెట్లు పాల్గున్నరని,ఈ పోటీలకు మంచి స్పందన వచ్చిందని 30 అథ్లెట్లను ఎంపికచేసి ఈ నెల 22 న హనుమకొండలో జరుగు రాష్ట్ర జానియర్ అథ్లెటిక్స్ చంపియన్షిప్ కు పంపుతామని జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరి కె.మహిధర్ తెలిపారు.ఈ ఎంపికల ల జిల్లా కోచ్ లు పి.నాగేందర్,మల్లికార్జున ,గిరిప్రసాద లు నిర్వహించారు.ఈ కార్యక్రమము లో పెద్దమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ మహీపతి రామలింగం,చింత నాగరాజు,దాసరి నాగేస్వరరావు క్రీడాకారులు తదితరులు పాల్కొన్నారు.