భద్రాద్రి కొత్తగూడెం బ్రేకింగ్ న్యూస్
* ఇదిగో "మన కొత్తగూడెం" ఇలా..?
* మున్సిపల్ అధికారులకు ప్రజాప్రతినిధులకు కనిపించడం లేదా ?
భద్రాద్రి కొత్తగూడెం : ఇదిగో "మన కొత్తగూడెం" ఇలా..? జిల్లా కేంద్రం నడిబొడ్డులోని డ్రైనేజీ నీరు రోడ్డుపై పారుతుండడంతో జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య గత కొన్ని రోజులు ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులకు ప్రజాప్రతినిధులకు కనిపించడం లేదా..? అంటూ పలువురు తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. సోమవారం దీపావళి పర్వదినం రోజున జిల్లా ప్రజలకు మురుగు స్వాగతం పలకడం విచారకరం. వ్యాపారస్తులు డ్రైనేజీని పూర్తిగా కబ్జా చేసి తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు మౌనంగా ఉండడం పట్ల పలు అనుమానాలకు తావిస్తుందని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఆంధ్ర బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ రైల్వే అండర్ బ్రిడ్జి సెంటర్లో డ్రైనేజీ మురుగు పారుతూ నిల్వ ఉంటుంది. ఈ మురుగును చూసిన జనం మన పట్టణ ప్రగతి ఇలా ఉందని నవ్వుకుంటున్నారు. ఒక దిక్కు ప్రజలు రోగాలతో అల్లాడుతుంటే మరో దిక్కు డ్రైనేజీ కంపుతో ఒక్కరి బిక్కిరి అవుతున్నారు. ఈ సమస్య ఇంకా ఎన్ని రోజులు ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
మురుగు స్వాగతం, డ్రైనేజీ మురుగు పారుతూ నిల్వ
అమర వీరుల సంస్మరణ వారోత్సవాల బైక్ ర్యాలీ
పాల్వంచ టౌన్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్బంగా పాల్వంచ పోలీస్ వారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన పాల్వంచ CI నాగరాజు.పాల్వంచ DSP ఆఫీస్ నుండి అంబేద్కర్ సెంటర్, నటరాజ్ సెంటర్, మార్కెట్ మీదుగా పాల్వంచ బస్టాండ్ వరకు పాల్వంచ పట్టణ పోలీస్,యువత పోలీస్ అమర వీరులకు జోహార్ జోహార్ అనీ నినాదిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ SI లు నరేష్,ప్రవీణ్,రూరల్ SI శ్రీనివాస్,MB యూత్ అధ్యక్షులు మధుచంద్ బత్తుల,పోలీస్ సిబ్బంది మరియు పాల్వంచ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
దీపావళి వేడుకలు సంతోషంగా జరుకున్న ఎమ్మెల్యే వనమా
దీపావళి వేడుకల్లో పాల్గొని, బాణాసంచా కాల్చి వేడుకలును ఘనంగా నిర్వహించరు.ఈరోజు పాత పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా గారి స్వగృహంలో దీపావళి పండుగ సందర్భంగా, పటాకులు కాల్చి, దీపావళి పండుగను ఘనంగా నిర్వహించిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు మరియు శ్రీమతి పద్మావతి గారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ చెడుపై మంచి విజయం సాధించిన రోజు ఈ దీపావళి పండుగని, కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలలో ఈ దీపావళి పండుగ వెలుగులు నింపాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే వనమా.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి
-DCMS వైస్ చైర్మన్ కొత్వాల
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి అని DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. సోమవారం దీపావళి పర్వదినం సందర్భంగా పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాధపురం శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో కొత్వాల దంపతులు పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు.అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాత మొదటిసారిగా కొత్వాల పెద్దమ్మతల్లిని దర్శించుకున్నారు. దేవాలయం పూజారులు కొత్వాలను శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ భారతదేశం, తెలంగాణ రాష్ట్రం, కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలందరి జీవితాల్లో ఆనందపు ప్రగతి కాంతులు వెల్లివిరియాలని,సుఖశాంతులతో,సిరి సంపదలతో తులతూగాలని అన్నారు. పర్యావరణ హితంగా దీపావళి పండుగను జరుపుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దమ్మ గుడి డైరెక్టర్ బేతంశెట్టి విజయ్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు నందా నాయక్, గంధం నరసింహారావు, గంధం వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.