కరం చల్లి... కొడవలితో నరికి హత్యా !!!
* ఎమ్మెల్సీ ఇక్కబల్ హస్తం ఉందని తల్లి వేదన
* రాజకీయాలలో పరస్పర వివాదాలే కారణం
ఆంధ్ర ప్రదేశ్: అతి దారుణంగా కారం చల్లి వేట కొడవలితో నరికిన దుండగులు హత్య చేసిన ఘటన సత్య సాయి జిల్లాలో చోటు చేసుకుంది.హిందూపురం నియోజకవర్గం వైసీపీ మాజీ సామాన్య కార్యకర్త చౌలూరు రామకృష్ణారెడ్డి 46సం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. తన ఇంటి ముందే కార్లో నుండి దిగుతుండగా కళ్ళల్లో కారంపొడి చలి ఆపై వేట కొడవలితో దారుణంగా నరికి హత్య చేశారు.ఈ యొక్క ఘటన పట్టణంలో కలకలం రేపుతుంది.అతని పై శరీరంపై 18 చోట్ల నరికిన కత్తిపోట్లు ఉన్నాయంటే ప్లాన్ ప్రకారం చేశారు అంటూ పోలీసులు తెలియజేశారు.
అసలేం జరిగిందంటే..
వైసిపి నేత రామకృష్ణారెడ్డి చోలురు సమీపంలో కర్ణాటక సరిహద్దులో దాబా ఉంది. ఆయనకు భార్య కుమారుడు ఉన్నాడు. వైసీపీ నేత రామకృష్ణారెడ్డికి భార్య కుమారుడు ఉన్నాడు. ప్రతి రోజు లాగానే వెళ్లి రావడంతో తన అడుగు జాడలు గమనించారు కొందరు దుండగలు రాత్రి సైతం దాబా మూసేసి కారులో ఇంటికి చేరుకున్నాడు. కారు డోరు తీసి కిందికి దిగగానే కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయనను చుట్టుముట్టారు. మొదట కన్నులలో కారంపూడి చల్లి తర్వాత వేట కొడవలితో రామకృష్ణారెడ్డిని విచక్షణ రైతంగా దాడి చేశారు. దుండగుల దాడిలో వైసీపీ నేత కుప్పకూలిపోయారు. రామకృష్ణారెడ్డిని స్థానికులు హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అధిక రక్తస్రావం జరగడంతో వైసిపి నేత అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలియజేశారు.
ఉంది కుటుంబం ఆరోపణలో తన కుమారుడి హత్యకు కారణం ఎమ్మెల్సీ ఇక్కబల్ కారణమని తెలిపారు.ఆయన సహాయకుడు గోపి చాకలి రవి,సంచుడి రెడ్డి,మురళి,కేపీ నాగడు,తదితరుల హస్తం ఉన్నట్లు మృతుడి రామకృష్ణారెడ్డి తల్లి నారాయణమ్మ ఆరోపించారు. ఇటీవల ఎమ్మెల్సీ పీఏ పై రామకృష్ణారెడ్డి పలు ఆరోపణలు చేశారు. గ్రామీణ మండల సిఐ జీటి నాయుడు పై జాతీయ బాలల హక్కుల సంఘానికి సైతం ఫిర్యాదు చేయడం. ఆగస్టు 15న గ్రామంలో జాతీయ పతాకం ఎగురవేసే సమయంలో ఎమ్మెల్సీ ఇక్కబల్ వర్గీయులకు రామకృష్ణారెడ్డి మధ్య వివాదం జరిగిందని. ఈ వివాదంలో రామకృష్ణారెడ్డిని చంపేస్తామని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రెండు బైకులపై మొత్తం ఐదు గురు దుండగులు వచ్చి హత్యా చేశారని స్థానికులు వెల్లడించారు. హత్య చేసిన వెంటనే నిధితులు అదే బైక్ పై పారారయ్యారు ప్లాన్ ప్రకారం రావడంతో నిందితులు తమకు ఎవరు గుర్తించకూడదని ముఖాలకు మాస్కులు ధరించుకున్నారని తెలియజేశారు.