తమ కుటుంభాలను సైతం త్యాగం చేస్తున్నా పోలీసులు జిల్లా కలెక్టర్ నిఖిల
* పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సంధర్బంగా కార్యక్రమం
* వీధి నిర్వహణలో తమ కుటుంభాలను సైతం త్యాగం చేస్తున్నారు పోలీసులు జిల్లా కలెక్టర్ శ్రీమతి.నిఖిల
* పోలీస్ లేని సమాజాన్ని ఊహించుకోవడం చాలా కష్టం
* పోలీస్ అమరవీరులకు జోహార్లు
* 24*7 విధులు నిర్వహిస్తు భాద్యత వహించడం
* ఎండనక వాననక,పగలు రాత్రి అనే తేడా లేకాండ
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిధిలోని శుక్రవారం రోజున పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు ఫ్లాగ్ డే (పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం) కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ప్రపంచం అంతా నిద్రలో ఉంటే పోలీస్ మేలుకొని శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటాం,ఎండనక వాననక,పగలు రాత్రి అనే తేడా లేకాండ కుటుంభంతో కలిసి జరుపుకునే పండుగాలను కూడా త్యాగం చేసి ప్రజలకోసం జీవించి, ప్రజలకోసం మరణించే పోలీస్ వారు ప్రాణాలు పణంగా పెట్టి చేసినటువంటి త్యాగానికి సానుభూతిగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరపడం మన అందరి భాధ్యత జిల్లా ఎస్‌పి శ్రీ.N.కోటి రెడ్డి IPS.
ఇట్టి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి నిఖిల ఐఏఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరైయారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్‌పి పరేడ్ కమాండర్ తో గౌరవందనం తీసుకొని అమరవీరుల పేర్లు కల్గిన పుస్తకాన్ని విడుదల చేసి జిల్లా ఎస్‌పి గారికి ఇవ్వగా జిల్లా ఎస్‌పి గారు అదనపు ఎస్‌పి గారికి ఇవ్వగా ఈ సంవత్సరం మరణించిన వారి పేర్లను చదువుతూ స్మరించినారు.జిల్లా ఎస్‌పి మాట్లాడుతూ సుమారుగా 63 సం.రాల క్రితం 1959 అక్టోబర్ 21 న సముద్ర మట్టానికి 1600 నుండి 1800 అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మద్యన ఉన్న హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో డీఎస్పీ కరమ్ సింగ్ గారి నేతృత్వంలో 21 మంది బిఎస్యాప్ బృందం కూంబింగ్ నిర్వహిస్తుండగా,ఎలాంటి హేచ్చరికలు లేకుండా ఒక్కసారిగా చైనా సైనికులు కాల్పులు జరపడం ప్రారంభించారు.
మన BSF బృందం వారిని దీటుగా ఎదుర్కుంటూ దేశ రక్షణ కొరకు తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి శత్రు దేశానికి భారత దేశ పౌరుషమును చూపించడము జరిగినది. దేశ రక్షణ కొరకు చివరి రక్తపు బొట్టు వరకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న క్రమములోనే డిఎస్‌పి కరమ్ సింగ్ తో పాటుగా 10 మంది,భారతమాత రక్షణలో వీరమరణం పొందినారు మరికొందరికి గాయాలు అయ్యాయి. ఆరోజు నుంచి అక్టోబర్ 21 నాడు పోలీస్ సంస్మరణ దినం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మన రాష్టం లో కూడా గ్రేహౌండ్స్ లో విధులు నిర్వహిస్తున్న అధికారులు కెఎస్ వ్యాస్,పరదేశి నాయుడు,ఉమేశ్ చంద్ర లాంటి ఐపిఎస్ అధికారులు మరియు ఎందరో అధికారులు మరియు సిబ్బంది తమ ప్రాణాలను అర్పించడం జరిగింది.ప్రతి సంవత్సరం ఎంతోమంది పోలీసులు దేశ రక్షణలో భాగంగా తమ ప్రాణాలను కోల్పోతున్నారు.ఈ సంవత్సరం కూడా సుమారుగా 264 మంది వీరమరణం పొందడం జరిగింది. వారందరినీ స్మరించుకోవడం మనందరి భాద్యత.
పోలీస్ వీధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నది, ఇతర శాఖల్లాగా కొన్ని గంటలకే పరిమితమైనది కాదు 24*7 విధులు నిర్వహిస్తు భాద్యత వహించడం జరుగుతుంది.పోలీస్ లేని సమాజాన్ని ఊహించుకోవడం చాలా కష్టం అంతర్గత సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కుంటున్న పోలీస్ అమరవీరులకు జోహార్లు మరియు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా వెనకాడరని.. అమరులైన పోలీసులు మనకు,సమాజానికి నిరంతరం గుర్తు చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ సహకారంతో సాంకేతికతను వినియోగించి పోలీసు సేవలలో నాణ్యతను పెంచడానికి నిరంతర కృషి జరుగుతున్నది.
పోలీసు అమరవీరుల త్యాగాలను మరొక్కసారి స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.అని జిల్లా ఎస్‌పి గారు స్మరించుకోవడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీమతి. నిఖిల IAS గారు మాట్లాడుతూ మనకోసం ప్రాణాలు త్యాగం చేసిన ప్రతిఒక్క పోలీస్ అధికారులను స్మరించి వారి యొక్క త్యాగాన్ని గుర్తించుకోవాలి పోలీస్ విధి నిర్వహణలో తమ కుటుంభాలను సైతం త్యాగం చేస్తూ మనందరికీ సేవలు చేస్తారు. కుఖ్యంగా కోవిడ్ సమయంలో మాత్రం అందరికంటే ముందు నడిచి కోవిడ్ నిబందనలు పాటించేవిదంగా చూడటం జరిగింది. మరియు శాంతి భద్రతలకోసం మనం,మన కుటుంభాలు క్షేమంగా ఉండటం కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్న పొలుసులందరికి ధన్యవాదలు అని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి హాజరు అయిన పోలీస్ అధికారులు అందరూ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలను ఉంచి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించడం జరిగింది.జిల్లా అదనపు ఎస్‌పి శ్రీ ఎంఏ రశీద్, డిటిసి అదనపు ఎస్‌పి మురళిధర ,వికారాబాద్ డిఎస్‌పి సత్యనారాయనా , పరిగి డిఎస్‌పి కరుణాకర్ రెడ్డి గారు, తాండూర్ డిఎస్‌పి శేకర్ గౌడ్, జిల్లా ఇన్స్పెక్టర్ లు ఎస్‌ఐలు పోలీస్ సిబ్బంది తరితరులు పాల్కొన్నారు.