బరితెగ్గించిన భార్య భర్తను చంపింది ఏమైందో చూడండి
- భార్య భర్తలకు ప్రేమ లేక మరణానికి దారి
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన తల్లి పిర్యాదు
- దర్యాప్తులో నిందితులను నిఘా పెట్టిన పోలీసులు.
- అరెస్టు చేస్తారనే భయంతో తపించుకొని తిరుగుతూ
- పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన నిందితులు
క్రైమ్ : నేటి కాలంలో భార్య భర్తలకు ప్రేమ లేక మరణానికి దారితీస్తున్నాయి.ఇలాంటి ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. ఖమ్మం యపిహెచ్ కాలనీలో నివాసం ఉంటున్న ఎస్కె అన్వర్ అనే వ్యక్తి గత కొంత కాలంగా కనిపించడం లేదని అతని తల్లి రహమత్ జూలై నెలలో ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసును నమోదు చేశారు.ఖమ్మం అర్బన్ పోలీసులు సిఐ రామకృష్ణ దర్యాప్తులో అన్వర్ ఆచూకీ కోసం అన్నీ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఏసిపి ఆంజనేయులు తెలిపారు. కేసు విచారణలో భాగంగా అనుమానితులైన భార్య సల్మా.అత్త సదుకన్ మరియు బాలాజీ పై నిఘా పెట్టి వారి కదలికలను పసిగడుతుండగా భార్య సల్మా స్థిర నివాసమైన మహబూబాబాద్ లో ఉంటున్నరాని తెలిసి అక్కడి పోలీసుల సహాయంతో వారిని పట్టుకోవడం కోసం తిరిగినా ఫలితం లేదు.పోలీసులు వారిని ఎలాగైనా పట్టుకుంటారని భయపడిన బంధువులు వారికి ఆశ్రమం ఇవ్వలేదు అని తెలియజేశారు.పోలీసుల నుండే తప్పించుకునే పరిస్థితి లేదని గ్రహించి ఖమ్మం నగరంలో వారికి తెలిసిన పెద్దమనుషుల సహకారంతో పోలీస్ స్టేషన్కు స్వయంగా నిందితులు వచ్చారు.
నిందితులు అన్వర్ భార్య సల్మా అత్త సాదుకన్ బావమరిది యాకుబ్ మరియు బాలాజీ వీరన్నను విచారించగా అన్వర్ ను మేమే హత్య చేశామని ఒప్పుకున్నారు అని తెలిపారు.అన్వర్ వివాహం అయిన దగ్గర నుండి చికెన్ దుకాణంలో పనిచేస్తున్నాడాన్ని మద్యం త్రాగడానికి బానిస కావడంతో పాటు గంజాయి అలవాటు పడి ప్రతి రోజు భార్యను అనుమానిస్తాడని వారి ఇద్దరి ఆడపిల్లలను పట్టించుకోకుండా అప్పుడప్పుడు ఇంట్లో నుండి రెండు మూడు నెలలు ఇంట్లో నుండి వెళ్లి తిరిగి తనంతట తానే వచ్చేవాడని.
భార్యను చిత్రహింసలు చేసి కొట్టడానికి ఎన్నిసార్లు చెప్పినా తన ప్రవర్తనలు మార్పు రాలేదని అన్వర్ తన భార్య సల్మాను ఇంట్లో గ్యాస్ లీక్ చేసి చంపాలని ప్రయత్నం కూడా చేశాడని నిందితురాలు తెలియజేసింది.మృతుడు అన్వర్ మామ చనిపోగా అన్వర్ అత్త సాదుకన్ ఖమ్మంలో తన కూతురు సల్మా ఇద్దరు పిల్లలతో ఉంటుంది. సుతారి పనులకు వెళ్తున్న క్రమంలో బాలాజీ పరిచయమై గత 15 సం. నుండి అన్వర్ అత్తతో బాలాజీ అక్రమ సంబంధం పెట్టుకొని ఇద్దరు కలిసి పనులకు వెళ్తుండే వారు.
బాలాజీ తన అత్తా వెంట వెళ్లడం అన్వర్ కు నచ్చకలేదు ఎన్నిసార్లు చెప్పిన కూడా బాలాజీ అలాగే వస్తున్నాడని బాలాజీ మీద కోపం పెంచుకున్నాడు అల్లుడు.గత సంవత్సరం యుపిఎచ్ కాలనీలో సెప్టెంబర్ 26వ తేదీన బాలాజీ బండిని అన్వర్ తగలపెట్టాడు.దీంతో బాలాజీ కత్తితో దాడి చేసిన కేసు ఖమ్మం ప్రాంతంలో గత సంవత్సరం నమోదయింది. అన్వర్ ఆకృత్యాలను భరించలేక భార్య సల్మా,అందరు కలిసి చంపాలని నిర్ణయించుకున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ రాత్రి సమయంలో అన్వర్ చేతుల్ని చున్నీతో,కాళ్ళను దాడుతూ కట్టి ఇష్టం వచినట్టుగా కొట్టారు.
అనంతరం అన్వర్ బావమరిది అయిన యాకుబ్ ఆటోలో బాలాజీ,చిర్ర వెంకన్న ముగ్గురు ఆటోలో గోపాలపురం ఎస్ఆర్ గార్డెన్ వెనుకాల సాగర్ కెనాల్ లో తీసుకెళ్లి అక్కడ ఉన్న కాలువలో పడేశారు.ఆ రోజు నుండి ఐదుగురు అన్వర్ హత్య గురించి బయటకు రాకుండా జాగ్రత్తపడి బయట ప్రాంతంలో ఉంటున్నామని నేరం ఒప్పుకున్నారు. వారి నుండి ఆటో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అన్వర్ భార్య సల్మా అత్త సదుకన్ బామ్మర్ది యాకుబ్ మరియు బాలాజీ వెంకన్నను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాగా వారిని మేజి స్ట్రీట్ గారు రిమాండ్ కు తరలించారు ఏసీపి తెలిపారు.