మొక్కలు నాటిన DCMS వైస్ చైర్మన్ కొత్వాల
* నివాస ప్రాంతాల్లో పూలమొక్కలు చక్కటి ఆహ్లాదాన్నిస్తాయి
- DCMS వైస్ చైర్మన్ కొత్వాల
పాల్వంచ : పట్టణ పరిధిలో నివాస ప్రాంతాల్లో పెరిగే పూల మొక్కలు మనసుకు చక్కటి ఆహ్లాదాన్నిస్తాయని DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. శనివారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని పాత పాల్వంచలో మున్సిపాలిటీ ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొత్వాలతో పాటు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ప్రారంభించారు.ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రంగురంగుల పూలతో ప్రాంతం అందంగా విరాజిల్లుతుందన్నారు.నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత అందరిపై ఉందన్నారు.పర్యావరణ పరిరక్షణకు,ఆరోగ్యవంతమైన జీవితానికి ఆక్సిజన్ ఎంతో అవసరమన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్,DE మురళి,బొందిల రాంబాబు,గడ్డం రమణయ్య, గ్రామస్తులు హరి సత్యనారాయణ, గోవిందరావు, వజ్జాల రాము,కుమ్మరి కుంట్ల నాగ,కొండలు,సుంకర వీరభద్రరావు,కనగాల శ్రీను,తదితరులు పాల్గొన్నారు.