నిరుపేద విద్యార్థిని జీవితంలో "దీపావళి"
తాండూర్ : వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలో అగ్గనూర్ అనుబంధ గ్రామమైన మల్రెడ్డిపల్లిలోని నిరుపేద విద్యార్థిని గొల్ల శిరీష ఆర్థిక స్థోమత లేక ఇంటర్ అనంతరం మధ్యలోనే చదువు ఆపివేసిన స్థితిని ఆ గ్రామ ఉపాధ్యాయుడు PRTU వికారాబాద్ జిల్లా గౌరవధ్యక్షులు శ్రీ దర్మిని వెంకట్రామిరెడ్డి ద్వారా తెలుసుకున్న తాండూర్ లోని"బాలాజీ హాస్పిటల్" వ్యస్థాపకులు డా.సంపత్ కుమార్ ఆ విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేసే అడ్మిషన్ కు చివరి రోజు అయిన శనివారం శాలివాహన కళాశాలలో B.Com (computers) మొదటి సంవత్సరం ప్రవేశం కల్పించారు. నిరుపేద తెలివైన విద్యార్థిని జీవితంలో వెలుగులు నింపిన డా.సంపత్ కుమార్ దాతృత్వానికి PRTU TS యాలాల్ మండల శాఖ కృతజ్ఞతలు తెలిపారు.ఆ నిరుపేద విద్యార్థికి ఇది నిజమైన దీపావళి అని, ఈ విషయంలో సహకరించిన సంఘ జిల్లా గౌరవాధ్యక్షుని కృషిని సంఘ అధ్యక్ష కార్యదర్శులు శ్రీధర్‌రెడ్డి, యాదయ్యగౌడ్ లు కొనియాడారు.