అల్లం పేస్ట్ బయట కొంటున్నారా అయితే మీ ఆరోగ్యం జాగ్రత్త
* తినుబండారాలలో నకిలీ మీ కుటుంబం జాగ్రత్త
* మనుషులు తినే ప్రతీదాంట్లో నకిలీ దందా రాజ్యమేలుతోంది
వికారాబాద్ : తాజాగా నకిలీ అల్లం కూడా మార్కెట్లోకి వస్తోంది. పొరపాటున గమనించకుండా కొంటే నష్టపోవాల్సిందే.సరిగ్గా అల్లంలా కనిపించే అటువంటి మూలికను వ్యాపారులు ఇప్పుడు ఎక్కువ లాభం కోసం మార్కెట్‌లో విక్రయించడం పెద్ద ఎత్తున మొదలుపెట్టారు.అల్లం చౌకగా ఉంటుందని,ఇంట్లో అల్లం పేస్ట్ తయారు చేసుకోలేమని పొరపాటున కొంటె మీ కుటుంబం ఆరోగ్యం అంతే.తాజాగా వికారాబాద్ జిల్లాలో స్పెషల్ పోలీసులు జరిపిన దాడుల్లో ఊహించని విధంగా నకిలీ కెమికల్ అల్లం పెద్ద ఎత్తున పట్టుబడింది.
తాగే పాల నుంచి అన్నీ కల్తీ అవతారం మెత్తాయి.ప్రాణం కంటే పైసలకు విలువ ఇచ్చే ఈరోజుల్లో మార్కెట్లో దొరికేవి తినగలిగేవే అయినా అవి నకిలీ వస్తువుల లేదా అనేది ఒకటికి పదిసార్లు చూసుకోవాలి.వీలైనంత వరకూ మనం పండించుకునేవి అయితే మన కుటుంబానికి మంచిది అని తెలిపారు.కల్తీ రాయుల గుట్టు రట్టు చేసిన వికారాబాద్ జిల్లా ట్రాన్స్ ఫోర్స్ పోలీసులు 150 క్వింటాళ్ల PDS రైస్, 16 డ్రమ్ముల అల్లం వెల్లుల్లి పేస్ట్ ను స్వాధీనం చేసుకున్న వికారాబాద్ జిల్లా ట్రాన్స్ ఫోర్స్ పోలీసులు ఒక్కో డ్రమ్ము సుమారు 50 కిలోలు ఉంటుందని మీడియా సమావేశంలో వెల్లడించిన ఎస్పీ కోటిరెడ్డి ఈ రెండు కేసులలో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.