పేదలకు అన్నదానం పెట్టాడడం గొప్ప పని
* పేదలకు అన్నదానంతో భగవత్ సాత్కారము జరుగుతుంది
* అన్ని ధానాలకన్నా అన్నదానం మిన్న - ఎం.ఎల్.ఏ.వనమా
కొత్తగూడెం : పేదలకు అన్నదానం చేస్తే భగవంతుని సాత్కారం జరుగుతుందని,పేదలకు అన్నదానంతో భగవత్ సాత్కారము జరుగుతుంది కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పాత పాల్వంచ గడియ కట్టలోని శ్రీ షిర్డీ సాయి బాబా భజన మందిరం లో 5 రోజుల పాటు వైభవంగా జరిగిన శ్రీ షిర్డీ సాయిబాబా 104వ పుణ్యతిధి (సమాధి) మహోత్సవాలు శనివారంతో ముగిశాయి.
చివరి రోజున పూజారి సుమన్ శాస్త్రి, ఆధ్వర్యంలో కాకడ హారతి అన్నాభిషేకం,ధుని పూజ,అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎం.ఎల్.ఏ.వనమా మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని,అన్నదానం ఎంతో పవిత్రమైనదన్నారు.సుమారు వెయ్యి మందికి అన్నదానంలో పాల్కొన్నారు.సాయిబాబా పుణ్యతిథి మహోత్సవాల సందర్భంగా దేవాలయం ప్రాంగణంలో సుమారు వెయ్యి మందికి అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్త ముత్యాల కోటేశ్వరరావు, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు,మాజీ కౌన్సిలర్ కొత్వాల సత్యనారాయణ,బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్,జెడ్పిటిసి సభ్యులు బరపాటి వాసుదేవరావు,పెద్దమ్మ గుడి చైర్మన్ మహీపతి రామలింగం,బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పూసల విశ్వనాథం,కమిటీ బాధ్యులు పాశం నాసరయ్య,గుడపాటి నాగేశ్వరరావు, చావా వెంకటేశ్వర రావు,వెలివెంటి సుబ్రహ్మణ్యం,ముత్యాల రమణ మూర్తి,పాశం గోపాలరావు.
కట్టా నరసింహారావు,పెద్దింటి రాంబాబు, మాచవరపు వీరయ్య, వనమా సత్యనారాయణ,రాజేష్,మోహన్ రావు,చిన్న పండు,దొప్పలపూడి వెంకటేశ్వరరావు,ఊటుకూరి శ్రీనివాసరావు,సల్లకోటి శ్రీనివాసరావు,వెంకట్,కిరణ్,శరత్,లక్ష్మీనారాయణ,పాశం నరసింహారావు,రామకృష్ణ,వనమా సరోజిని,కొత్వాల విమలాదేవి,కిలారి సుజాత, సామ్రాజ్యం,లక్ష్మి,శైలజ,వీర రాఘవమ్మ,పద్మ,కృష్ణవేణి,కృష్ణకుమారి,శ్రీదేవి,చిట్టి, సీత,వాణి తదితరులు పాల్గొన్నారు.