ఫ్యాక్టరీల ముందు కెమికల్...పంట పొలాలు నష్టపోతున్న రైతులను పట్టించుకోరా?
* సిపిఎం ఆధ్వర్యంలో సిపిఎం జెండా ఆవిష్కరణ
* గుంత బస్సు పల్లి, మిట్ట బాస్ పల్లి ప్రజలు పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ లో చేరారు
* పంట పొలాలు నష్టపోతున్న రైతులతో నిరుద్యోగ యువత తో సిమెంట్ ఫ్యాక్టరీల
* సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిపిఎం డిమాండ్
తాండూర్ : తాండూర్ మండలం గుంతబసుపల్లి మిట్టబసుపల్లి గ్రామాలలో సిపిఎం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామాల ప్రజలు సిపిఎం లో పెద్ద ఎత్తున చేరారు ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకట్ రాములు సిపిఎం జిల్లా కార్యదర్శి పి మల్లేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక నిరుద్యోగ యువతకు సిమెంట్ ఫ్యాక్టరీల లో ఉద్యోగాలు కల్పించాలని అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల సమస్యలు పరిష్కరించాలి నిత్యావసరాల ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెంచి పేదల పైన పెద్ద ఎత్తున భారం వేస్తూ రైతులకు గిట్టుబాటు ధర లు కల్పించకుండా కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసే పరిస్థితి లేదు రైతుల పొలాల నుండి చెట్టినాడు రైల్వే ట్రాక్ వెళ్లినందున రైతు పంట పొలాలలో వర్షకాలం సందర్భంగా పెద్దఎత్తున పంట పొలాలు నష్టపోతూనారు కెమికల్ ఫ్యాక్టరీ ల వల్ల త్రాగు నీరు కలుషితమై ప్రజలకు విద్యార్థులకు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని కెమికల్ ఫ్యాక్టరీ కాలుష్యం వెదజల్లుతున్నది.
కెమికల్ ఫ్యాక్టరీ పై చర్య తీసుకొని వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కులం పేరుతో మతం పేరుతో పైన దళితులపైన మహిళలపైన కార్మికుల దాడులు దౌర్జన్యాలు కార్మిక చట్టాలను కాలరాస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నారు రైతులపై కార్మిక చట్టాల పై దాడి చేస్తూ రోజురోజుకు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేటర్ పెట్టుబడిదారులకు అమ్ముకుంటూ పేద ప్రజలను కష్టాల పాలు చేస్తున్న పరిస్థితి ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నా పోరాడాలని సిపిఎం ఎర్రజెండా ఆధ్వర్యంలో అన్ని గ్రామాలను పర్యటిస్తూ ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బుగ్గప్ప తాండూర్ సిపిఎం నాయకులు మల్లయ్య గోపాల్ రాజు మిట్టబసు పల్లి గ్రామంలో సిపిఎం గ్రామానికి చెందిన జైపాల్ శేఖర్ కాషాప్ప వారి ఆధ్వర్యంలో 50 మంది చేరారు ఈ కార్యక్రమంలో కార్మికులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున, ఎర్ర జెండా పాటలకు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.