పశువులను రక్షించండి పశువుల వైద్యులు
బషీరాబాద్: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో పశువులకు ప్రబలిన లుంపీస్కిన్ (ముద్దచర్మం) వ్యాధిని నివారించేందుకు పశువుల వైద్యులు ఆనర్ సింగ్,ప్రశాంత్ స్పెషల్ వ్యాక్సిన్ పలు గ్రామంలో ఏకమై,మంతన్ గౌడ్,మైల్వార్,ఇతర గ్రామాలలో ఇంటిటికి వెళ్లి పశువులకు వ్యాక్సిన్ వేశారు.రైతులకు ఈ వ్యాధిని గురించి అవగాహనా ఇచ్చారు.
అంటు వ్యాధి ప్రబలకుండా పాల్వంచ ప్రాంతమంతా పశువులకు వ్యాక్సిన్ వేయించాలి
-DCMS వైస్ చైర్మన్ కొత్వాల
పాల్వంచ : పాల్వంచ మండలంలోని అన్ని ప్రాంతాల్లో పశువులకు ప్రబలిన లుంపీస్కిన్ (ముద్దచర్మం) వ్యాధిని నివారించేందుకు స్పెషల్ డ్రైవ్ తో వ్యాక్సిన్ వేయించేలా చర్యలు తీసుకోవాలని డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. మండలం పరిధిలోని జగన్నాధపురం,కేశవాపురం గ్రామాల్లో పశువుల వ్యాధి గురించి కొత్వాల ఇటీవల పర్యటించిన నేపథ్యంలో బుధవారం పశువర్ధక వైద్య శాఖ అధికారులు ఎ.డి.ఏ.డాక్టర్ సత్య ప్రసాద్,వెటర్నరీ డాక్టర్ రవీందర్,సిబ్బందితో పాటు కొత్వాల విస్తృతంగా పర్యటించారు. పశువులకు సిబ్బంది ఇంటింటికి తిరిగి ముందస్తు వ్యాక్సిన్లు వేశారు.ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ లుంపిస్కిన్ వ్యాధి నివారణలో ప్రజా ప్రతినిధులు యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు.
సర్పంచులు తమ పంచాయతీల పరిధిలో పశువులు కట్టివేసే ప్రాంతాల్లో ఫాగింగ్ చేయించాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, మురికి నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యాధి సోకిన పశువును, మందల్లో కలవకుండా వేరే చోట కట్టి వేయాలన్నారు. ఇతర ప్రాంతాల నుండి పశువులను కొనుగోలు ఆపివేయాలన్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులు తమ సిబ్బందిని మండలంలోని అన్ని ప్రాంతాల్లో పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు మాలోత్ నందా నాయక్, భానోత్ బాలాజీ, కొండం పుల్లయ్య, గంధం వెంగళరావు, గంధం నరసింహారావు, రావుల చలపతిరావు, గంధం నరేష్, కొంపెల్లి వెంకన్న, పశువర్ధక సిబ్బంది,జేఈఓ భాస్కర్, రమణారావు, మాన్ సింగ్,అత్కర్, పాషా,రాము తదితరులు పాల్గొన్నారు.