రక్తదానం ప్రాణదానంతో సమానం
* రక్తదానం చేసిన యువకులు,పోలీస్ సిబ్బంది
* రక్తదానం చేసిన వారికీ ప్రశంశ పత్రాలు
* రక్తదాన శిబిరం బృహోత్కారకార్యం
* మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు
తాండూర్ : తాండూర్ పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ సందర్భంగా తాండూరు పోలీసు డిఎస్పీ శేఖర్ గౌడ్ వారి ఆధ్వర్యంలో శనివారం రోజున సమద్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.ఈ యొక్క శిబిరనికి భారీ ఎత్తున యువకులు తరలి వచ్చి రక్త దానం చేశారు.పోలీసులు సిఐలు రాజేందర్ రెడ్డి,రాంబాబు మరియు బషీరాబాద్ ఎస్ఐ విద్య చరణ్ రెడ్డి ఆయా మండల ఎస్ఐ రక్త దానం చేసి ప్రాణ ధాతలుగా నిలిచారు.ఈ సందర్భగా డిఎస్పీ మాట్లాడుతూ రక్త దానం చేయడం వలన ఒక ప్రాణాన్ని కాపాడినట్టు అని తెలిపారు.రక్త దానం చేయడం మంచిదే నూతన రక్తం అభివృద్ధి అవుతుంది కోరారు.అనంతరం రక్త దానం ఇచ్చినవారికి ప్రశంశా పత్రాలు అందించారు.
ప్రశంశ పత్రాలు అందుకున్న సతీష్ కుమార్,కాశిం,యువకులు
మెగా రక్త దాన శిబిరకి ముఖ్యఅతిథిగా తాండూరు మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ శ్రీమతి.పట్లోళ్ల దీప నర్సింలు పాల్కొన్నారు.అనంతరం సి.ఐ రాజేందర్ రెడ్డి,రాంబాబు గార్లతో కలసి రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు గారు మాట్లాడుతూ ముందుగా విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసు అమర వీరులను స్మరించుకున్నారు.ఒకరి కోసం చేసే త్యాగం ఉన్నతమైనదైతే,ప్రజారక్షణ కోసం పోలీసులు చేస్తున్న త్యాగాలు మహోన్నతమైనదన్నారు.
సమాజం కోసం త్యాగాలు, బలిదానాలు, శ్రమ చేస్తున్న పోలీసులను ప్రతి ఒక్కరూ అభినందించి తీరాలన్నారు.కేవలం పోలీస్ సిబ్బంది వలననే మనం భద్రంగా ఉన్నామని గుర్తుంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంగీత ఠాకూర్,తెరాస పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్,నాయకులు గుండప్ప,టీఆరెస్ సోషల్ మీడియా ఇంచార్జ్ ఇంతియాజ్ బాబా,నియోజకవర్గ పోలీసు శాఖ అధికారులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.