విద్యుత్ డివిజనల్ కార్యాలయంలో డిఈఈ కి వినతిపత్రం
* ఎస్సీ,ఎస్టి లకు 300 యూనిట్లు ఉచిత కరెంట్ (విద్యుత్) ఇవ్వాలి
* అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం
* పెట్టుబడుదారులకు బడా కంపెనీలకు సబ్సిడీలు ఇస్తున్నారు
- ఉప్పలి మల్కయ్య కెవిపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు
తాండూర్ : ప్రతి ఎస్సీ,ఎస్టి కుటుంబానికి 300 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలని కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం కేవిపీస్ ఆధ్వర్యంలో తాండూర్ విద్యుత్ డివిజనల్ కార్యాలయంలో డిఈఈ గారికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా కేవిపీస్ జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిఓ నంబర్ 342,సెప్టెంబర్ తేది 1,2018 రోజున విడుదల చేయడం జరిగింది.
ఎస్సీ,ఎస్టిలకు 101యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ అది ఎక్కడ అమలు కావటం లేదని స్పష్టం చేశారు. విద్యుత్ అధికారులు దళిత గిరిజనుల పై వివక్ష చూపిస్తూ కులం సర్టిఫికెట్ ఇవ్వాలని అధికారులు కొరివి పెడుతూన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వికారాబాద్ జిల్లా అనేక మంది దళిత గిరిజనులు ఉన్నప్పటికీ వారికీ ఈ ఉచిత కరెంట్ అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారాని అన్నారు.దేశంలో ఢిల్లీ,ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రలలో అక్కడి ప్రభుత్వాలు 200 యూనిట్లు ఉచితంగా ఇప్పటికే ఇస్తున్నారని తెలిపారు. ఉత్పత్తి అవుతున్నా విద్యుత్తు నిర్వీర్యం చేస్తున్నారని.
పెట్టుబడుదారులకు బడా కంపెనీలకు సబ్సిడీలు ఇస్తున్న ప్రభుత్వం అట్టడుగు వర్గాల ఉన్న దళితులకు ఉచితంగా ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే మొదటి విడతలో అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కేవిపీస్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిసిటీ కార్యాలయంలోఅధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నట్లు వివరించారు.రెండో విడతలోఇంటింటికి వెళ్లి దళితులతో సంతకాల సేకరణ చేపడతామని వివరించారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవిపీస్ డివిజన్ నాయకులు కోళ్ల గోపాల్, బైకని రాజు తదితరులు ఉన్నారు పాల్కొన్నారు.