కస్తూర్బా హాస్టల్లో సిబ్బంది లేక ఇబ్బందులు
తాండూరు : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం తాండూరులో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు సిబ్బందిని నియమించాలని ప్రగతిశీల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.గీత డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వై.గీత మాట్లాడుతూ తాండూరు కేజీబీవీలో సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించారు.కళాశాల అప్డేట్ అయి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థుల సంఖ్య కనుగొనగా సిబ్బందిని నియమించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ఆరు సంవత్సరాల నుండి నైట్ వాచ్మెన్ లేక ఇతర సిబ్బందికి పని బారమవుతుంది సిబ్బంది నియమించాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.నూతన భవనం ప్రారంభమైనప్పటి నుండి సిబ్బందికి విపరీతమైన పని భారం అవుతుంది అధికారులు స్పందించి సిబ్బందిని నియమించాలని ఐఎఫ్టియు కేజీబీవీ నాట్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రభుత్వ ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది అనిత కళావతి,అంజులమ్మ,బీబీ, నర్సమ్మ,భీమమ్మ,వెంకటమ్మ కళావతి పాల్గొన్నారు.