చేసిన పాపానికి ఫలితం రిమాండ్
- సి.ఐ రాంబాబు,ఎస్.ఐ అన్వేష్ రెడ్డి
బషీరాబాద్ : బషీరాబాద్ మండల పరిధిలో కంసాన్పల్లి (బి) గ్రామంలో వివాహిత పై లైంగిక దాడి ఘటన జరిగిన విషయం తెలిసిందే.కేసు దర్యాప్తు చేసి అనంతరం నిందితుడికి రిమాండ్ కు తరలించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో కంసాన్పల్లి (బి) అత్యాచారానికి పాల్పడిన చాకలి ముకుందు రిమాండ్ తరలించారు.16.10.2022 నాడు సమయం ఉదయం సుమరు 10:30 గంటలకు కంసాన్పల్లి(బి) గ్రామానికి చెందిన ఒక మహిళ తన కుమారునితో కలిసి తన మేకను గ్రామ శివారులో గల మంగలి నరసప్ప వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి తన మేకను మేపుతుండగా అదే గ్రామానికి చెందిన చాకలి ముకుందు ఆమె దగ్గరకు వచ్చి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమెను అత్యాచారం చేసినట్లు తన భర్తకు ఫోన్ ద్వారా తెలుపగా భార్యాభర్తలు ఇద్దరు బషీరాబాద్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి రిమాండ్ కు పంపించారని సి.ఐ రాంబాబు,ఎస్.ఐ అన్వేష్ రెడ్డి తెలిపారు.
సర్పంచ్ రాథోడ్ శంకర్ సన్పెన్షన్
బషీరాబాద్ మండలంలో నంద్యా నాయక్ తాండ ఇటీవల మతి స్థిమితం లేని యువతీ పై సర్పంచ్ లైంగిక దాడి చేశాడు.కలెక్టర్ నిఖిల సర్పంచ్ సన్పెన్షన్ చేశారు. నంద్యా నాయక్ తాండ సర్పంచ్ రాథోడ్ శంకర్ బుధవారం రోజున సన్పెన్షన్ చేశారు.ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీఓ రమేష్ తెలిపారు. ప్రస్తుతం సర్పంచ్ బాధ్యతలు ఉప సర్పంచ్ రవి అప్పగించినట్లు అధికారులు ఎంపీడీఓ రమేష్ తెలియజేశారు.