పోరాట యోధుడు కొమరం భీం
* జల్జంగిల్జమీన్ పోరాటం
* చొరబాటుదారులఆగడాలుఇకసమాప్తం
* ప్రతి ఆదివాసి గూడెంలో ఆదివాసి జెండా ఎగరాలి
* ఆదివాసి కోదమ సింహానికి ఘననివాళి
ఆదివాసి గోండు బెబ్బులి విప్లవ వీరుడు ఆదివాసి యుద్ధ నాయకుడు, గెరిల్లా యుద్ధంతో నైజం సర్కారునే గడగడ లాడించిన మన్యం పులి, ఆదివాసి తుడుం యావత్ ఆదివాసి సమాజానికి ఎనలేని కీర్తిని సాధించి ఇచ్చిన మకుటం లేని మహారాజు, ఆదివాసి ఉద్యమ కెరటం "కొమరం భీం" జయంతిని పురస్కరించుకొని, ప్రతి ఆదివాసి గడపలో నేడుకొమరంభీమ్ ఆయన పోరాటాలను తలుస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాము. ఈ గోండు సింహం కొమరం భీమ్ వీరోచిత పోరాటాలను నేటి ఆదివాసి యువత స్ఫూర్తిగా తీసుకోని ఆదివాసిలకు కంచుకోటలైన అడవి తల్లి ఏజెన్సీని కాపాడుతూ జల్, జంగిల్, జమీన్ పోరాటాలను ఉదృతం చేయాలి. "పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప". అజ్ఞానాన్ని వీడి ఐకమత్యంగా పోరాడుతూ జ్ఞాన బాటలో పయనిద్దాం. మన ఆదివాసి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ మన అస్తిత్వ సంపదకు మూల స్తంభాలై ధృడంగా నిలబడదాం. ఈ పోరాటంలో ఎంతమంది కుర్దు పటేళ్లు అడ్డొచ్చినా ఆదివాసి మహనీయుల ఆశయ సాధన లక్ష్యంగా ఆదివాసీ నాయకులు సంఘాలు ప్రజలు మేధావులు ఉద్యోగస్తులు యువత యువకులు ఐక్యతతో అందరూ కలిసి మన ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు హక్కులు చట్టాలు జీవోలు అభివృద్ధి వైద్య విద్య ఉపాధి ఉద్యోగం రాజకీయ అన్ని విధాలుగా ముందుకు దూసుకెళదాం.గిరిజన సేవక్ సంఘ్ జాతీయ ఆదివాసీ సంరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు అరేం ప్రశాంత్ తెలిపారు.
జై కొమరం భీం...
జై ఆదివాసి.. జై జై ఆదివాసి....
ఘనంగా జరుపుకున్న కొమరం భీం జయంతి
కొత్తగూడెం : మాన్య వీరుడు అదివాసి గోండు బెబ్బులి కొమరం భీం జయంతి సందర్భంగా జల్ జంగిల్ జమీన్ నిదానంతో తిరుగుపాటు పోరాట ఉద్యమ వీరుడు స్ఫూర్తితో ఆయన ఆశయాలు సాధించుట కొరకు నేటి యువత అందరూ కూడా కొమరం భీం ఉద్యమాలు పోరాటాలు చేయాలని ఆదివాసి హక్కులు చట్టాలు సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతులు వైద్య విద్య ఉపాధి ఉద్యోగం రాజకీయ ఐక్యత తో అభివృద్ధి చెందాలని తెలియజేస్తూ కొమురం భీం గారికి మహనీయులు ఘన నివాళులు అర్పిస్తున్నాము.గిరిజన సేవక్ సంఘ్ జాతీయ ఆదివాసీ సంరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర నాయకులు బాడిశ బిక్షం, అరెం ప్రశాంత్, కాకా పృథ్వి రాజ్,కుంజా రవి, తాటి రాజు తదితరులు పాల్గొన్నారు.