సింగరేణి డైరెక్టర్కి ఘనంగా సన్మానించిన డా.శివ కుమార్
కొత్తగూడెం : భారతరత్న అంబేడ్కర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివ కుమార్ నేతృత్వంలో సింగరేణి మహిళా కళాశాలలో గెస్ట్ లెక్చరర్స్ గా పనిచేస్తున్న వారిని తీసి వేయకుండా కొనసాగించాలని చేసిన విజ్ఞప్తుల మేరకు స్పందించి వారినే కొనసాగిస్తున్నందున హర్షం ప్రకటిస్తూ సింగరేణి డైరెక్టర్ శ్రీ చంద్రశేఖర రావు గారికి ఘనంగా సత్కారం ! అభినందన!!
సింగరేణి డైరెక్టర్ పా శ్రీ చంద్రశేఖర రావు మానవతామూర్తి మరియు సేవాతత్పరుడు భారతరత్న అంబేడ్కర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కవి సినీ గీతరచయిత గాయకులు సమాజసేవకులు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివ కుమార్.గత మూడు సంవత్సరాలుగా సింగరేణి మహిళా కళాశాలలో గెస్ట్ లెక్చరర్స్ గా ఎంతో క్రయము చెల్లిస్తూ నూరు శాతం ఫలితాలు సాధించిన వారిని తీసివేస్తూ కొత్తవారిని తీసుకోవాలని ఆలోచనను విరమించుకోవాలని ఎంతో త్యాగం తో పనిచేస్తున్న పేదవారైన సీనియర్స్ ని కొనసాగించాలని భారతరత్న అంబేడ్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సింగరేణి డైరెక్టర్ పా శ్రీ చంద్రశేఖర రావు గారిని జిఎం ఎడ్యుకేషన్ శ్రీ పద్మనాభ రెడ్డి గారిని జిఎం పర్సనల్ మరియు IRPM శ్రీ అందెల ఆనంద రావు గారిని మరియు సింగరేణి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ లను కలిసి విజ్ఞప్తులు సమర్పించి ఈ సమస్య యొక్క తీవ్రతను వివరించగా సింగరేణి డైరెక్టర్ పా. శ్రీ చంద్రశేఖర రావు గారు మానవతా దృక్పథంతో పేదవారికి చేయూతనివ్వాలని ఆలోచనతో తిరిగి సీనియర్స్ ని కొనసాగించడం డైరెక్టర్ పా.శ్రీ చంద్రశేఖర రావు గారి విశాల దృక్పథానికి మానవత్వానికి మంచి మనసుకు నిదర్శనం అని హర్షం ప్రకటిస్తూ భారత రత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కవి సినీ గీత రచయిత నాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు.
శనివారం రోజున రాత్రి హెడ్ ఆఫీస్ లోని డైరెక్టర్ గారి చాంబర్లో ఆచార్య డాక్టర్ మద్దెల తన బృందంతో కృతజ్ఞతా పూర్వకంగా డైరెక్టర్ పా.శ్రీ చంద్రశేఖర రావు గారిని పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల మాట్లాడుతూ సింగరేణిలో రెండు కేటగిరీల అధికారులు పని చేస్తున్నారని
* ONE IS PROBLEM SEARCHING OFFICRRS
* OTHER IS PROBLEM SOLVING OFFICERS
సమస్యను అన్వేషించే అధికారులు ఒక కేటగిరీ కాగా వారు 90% శాతం మంది ఉన్నారు.రెండవదిగా సమస్యను పరిష్కరించే అధికారులు వారు పది శాతం మంది మాత్రమే ఉన్నారు.వారిలో డైరెక్టర్ పా శ్రీ చంద్రశేఖర రావు జనరల్ మేనేజర్ పర్సనల్ అండ్ ఐ ఆర్ పి ఎం శ్రీ ఆనంద రావు గారి లాంటి వారిని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చని ఆచార్య డాక్టర్ మద్దెల అభిప్రాయపడ్డారు.ఉత్తమమైన మానవ జన్మకు సార్థకతగా దేవుడిచ్చిన అధికారాన్ని పది మందికి సహాయం చేయడానికి చేయూత నివ్వడానికి అండగా నిలవడానికి ఆదరించడానికి బదులుగా అహంకార దర్పం చూపించడానికి తమ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారని వారిని సృష్టించిన ఆ దేవుడే వారికి తగిన విధంగా బుద్ధి చెబుతాడని ఆచార్య డాక్టర్ మద్దెల హెచ్చరించారు శ్రీ చంద్రశేఖర రావు గారు కలకాలం ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆచార్య డాక్టర్ మద్దెల ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ పా శ్రీ చంద్రశేఖర రావు మాట్లాడుతూ అటు కార్మికులకు ఇటు సమాజానికి మరియు పేదవారికి సహాయం చేసే ఇటువంటి సేవచేసే భాగ్యాన్ని అధికారాన్ని ఇచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నానని ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ తనను సత్కరించి అభినందించిన oదుకు అంబేద్కర్ సంఘ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఆత్మీయ సత్కార అభినందన కార్యక్రమంలో డైరెక్టర్ పా.శ్రీ చంద్రశేఖర రావు జనరల్ మేనేజర్ పర్సనల్ అండ్ ఐఆర్ పిఎం శ్రీ అందెల ఆనందరావుఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ సింగరేణి ఏరియా లైజన్ ఆఫీసర్ మరియు భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ సలహాదారులు శ్రీకలవల చంద్రశేఖర్ జిఎం (సిపిపి) శ్రీ సి.హెచ్ నరసింహారావు జిఎం( ఈఎంఅండ్ ఐఈడి) శ్రీ సురేష్ లతో పాటుకమిటీ సభ్యులు ఆదర్శ్ కిరణ్ నరేందర్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల ఈ ఉద్యమానికి సహకరించిన జిఎం ఎడ్యుకేషన్ శ్రీ పద్మనాభ రెడ్డి గారికి సింగరేణి మహిళా కళాశాల ప్రిన్సి పాల్స్ శ్రీమతి శారద శ్రీమతి సంధ్యారాణి మరియు ఇతర సంఘాల నాయకులకు సంఘ కమిటీ సభ్యులు అపర బాలు అల్లి శంకర్ గారికి సినీ నటులు తాండూర్ ధనరాజు గారికి జిల్లా ప్రచార కార్యదర్శి లావుడియా సత్యనారాయణ MPTC గణేష్ జిల్లా ఆర్గనైజర్ స్టీవెన్ లాజరస్ జిల్లా ఉపాధ్యక్షులు గుంటి రామ్ చందర్ లను ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఈ సందర్భంగా అభినందించారు.
సర్వేజనా సుఖినోభవంతు!
కృతజ్ఞతాభివందనా లతో!!
ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఎంఏ బీఈడీ
కవి సినీ గీతరచయిత గాయకులు సమాజసేవకులు సకల కళా సామ్రాట్
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్
జాతీయ జనసేన సద్భావన పురస్కార గ్రహీత
ప్రతిష్టాత్మక డాక్టర్ సినారె సాహిత్య పురస్కార గ్రహీత
ప్రతిష్ఠాత్మక డాక్టర్ దాశరథి సాహిత్య పురస్కార గ్రహీత
భారత రత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు
అభ్యుదయ కళా సేవ సమితి జిల్లా అధ్యక్షులు
సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు
తెలంగాణ బాలోత్సవ్ వ్యవస్థాపక కన్వీనర్
కొత్తగూడెం భద్రాద్రి.