నరేంద్రమెడీకి కెటిఆర్ సవాల్
- ఆత్మ గౌరవానికి డబ్బుకు మధ్య పోరాటమే ఉప ఎన్నికలు
- వేల కోట్ల కాంట్రాక్ట్ కోసమే కాంగ్రెస్ నుండి బిజెపిలోకి
హైదరాబాద్ : మంగళవారం రోజున టిఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ జనరల్ బాడీ మీటింగ్ హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ శాఖ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఇతర టిఆర్ఎస్వి రాష్ట్ర జిల్లా నియోజకవర్గ ఇన్చార్జిలు మండల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత గెల్లు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షులు టిఆర్ఎస్వి రాష్ట్ర విద్యార్థి విభాగం ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ భవిష్యత్తు విద్యార్థులదే అంటూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం దేశంలో అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగ కల్పనాలో ఐటీ రంగంలో పారిశ్రామిక రంగంలో ముందంజు ఉందన్నారు.ఈ రోజు మునుగోడులో ఉప ఎన్నికలు ఉన్నాయి బిఆర్ఎస్ గెలుస్తుంది అని అన్నారు.వేలకోట్ల కాంట్రాక్ట్ కోసమే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుండి బిజెపిలోకి వెళ్లాడు తప్ప మునుగోడు అభివృద్ధి కోసం కాదని ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ గౌరవంగా చెప్తుంది నల్గొండ జిల్లాలో ముఖ్యంగా మునుగోడులో అనేక అభివృద్ధి పనులు టిఆర్ఎస్ పార్టీ చేసిందని ఆయన అన్నారు.పార్టీ గెలుపు కోసం విద్యార్థులంతా కలిసి మునుగోడులో ప్రచార నిర్వహించి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం
తాండూర్ : తాండూర్ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కోటపల్లి మండలంలోని గ్రామాల లబ్ధిదారులకు 82,500/ రూపాయల చెక్కులను నలుగురు లబ్ధిదారులు అన్నాసాగర్ గ్రామం పద్మమ్మకు రూ. 24,000/- ఒగ్గులపురం గ్రామం మల్లయ్యకు రూ 26,000/- లింగంపల్లి గ్రామం నాగమణికు రూ.20,000/- బుగ్గాపురం గ్రామం మల్లేశంకు రూ.12,500/- చెక్కులను కోటపల్లి మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం లబ్ధిదారులకు అందించడం జరిగింది. నిరుపేదలకు ఆరోగ్యపరమైన సమస్యల ద్వారా వివిధ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి మళ్లీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా డబ్బులు అందించడం ఎంతో సంతోషించదగిన విషయం. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, సీనియర్ నాయకులు పతంగి పాండు, లకాకుల మల్లేశం, సమ్మయ్య, మండల ప్రధాన కార్యదర్శి కుమ్మరి లాలప్ప, అనిల్ దొర, దినేష్, అన్న సాగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు కృష్ణ, లింగంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు అనంతరెడ్డి, బుగ్గాపురం నర్సింలు గౌడ్, కోటపల్లి గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు మోసిన్, ప్రధాన కార్యదర్శి సుశీల్ కుమార్, నర్సింలు, మైపాల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.