తల్లిదండ్రుల పరువు తీయకూడదు
ఆంద్ర ప్రదేశ్ : మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ పై సోదరుడు భూమా కిషోర్ రెడ్డి మండిపడ్డారు అంతేకాకుండా అఖిల ప్రియ పై తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. కన్న తల్లిదండ్రులపై చీటింగ్ కేసు పెట్టడం అవమానకరంగా ఉందన్నారు.దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతులపై వారి కూతురు భూమా అఖిలప్రియ, అల్లుడు భార్గవరామ్ చీటింగ్ కేసు పెట్టించడం అవమానకరమన్నారు. అంతేకాకుండా డబ్బు కోసం అఖిలప్రియ విఖ్యాత్ రెడ్డి తల్లిదండ్రుల పైనే చీటింగ్ కేసు పెట్టించే స్థాయికి దిగజాతారని అనుకోలేదన్నారు కిషోర్ రెడ్డి. తన పిన్ని, బాబాయ్ ఎంతో కష్టపడితే కానీ ఈ స్థాయికి రాలేదని అఖిలప్రియ వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తి అన్నారు.
ఆమె ఎమ్మెల్యే, మంత్రి అయ్యిందంటే భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి వల్లే అన్నారు.తమ ఎదుగుదల కోసం తల్లిదండ్రుల పేర్లు చెడగొట్టడం బాధాకరంగా ఉందని.2011లో భూమా నాగిరెడ్డి ఆస్తులు అమ్ముకునే స్థితిలో ఉన్నారని అవాస్తవాలు ప్రచారం చేయడం చాలా సిగ్గుచేటన్నారు. వారసులంటే డబ్బును, అధికారాన్ని అనుభవించడం కాదు.తల్లిదండ్రుల పేరును నిలబెట్టాలని అఖిలప్రియ, విఖ్యాత్ రెడ్డి గుర్తుపెట్టుకుంటే మంచిదన్నారు. తల్లిదండ్రుల పేరు నిలబెట్టలే కానీ వాళ్ల పరువు తీయకూడదు అన్నారు .అఖిలప్రియ చేసే వ్యవహారాల వల్ల భూమా కార్యకర్తలు, అభిమానులు తలదించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇదంతా చూస్తూ జగన్ విఖ్యాత్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. భూమా అభిమానులు వాళ్లను అళ్లగడ్డలో ఈడ్చి కొడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.