ఇచ్చిన మాటను నిలపెట్టుకున్న ఎమ్యెల్యే పైలట్
★ తాండూర్ రూపు రేఖలు మారుస్తున్న ఎమ్యెల్యే
★ రెండు పక్కల డ్రైనేజ్ నిర్మాణం
★ త్వరలో సెంట్రల్ లైటింగ్
★ త్వరలో రెండు పక్కలా సిమెంట్ టైల్స్ తొ ఫుట్ పాత్ నిర్మాణ
★ రోడ్డు నిర్మాణానికి ఆటంకాకు ఉన్న కరెంట్ పోల్స్ తొలగించడం
తాండూర్ : తాండూర్ పట్టణంలో ఎమ్యెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు గౌతాపూర్ నుండి తాండూర్ వరుకు బి.టీ. రోడ్ రెండవ లేయర్ పనులు ప్రారంభం చేశారు.గౌతఫూర్ నుండి కరణ్ కొట్ రోడ్ పనులు దీపావళి తర్వాత ప్రారంభం కానున్నాయి.మాన ఎమ్మెల్యే సాబ్ ది ఒక్కటే నినాదం,ఒక్కటే విధానం,ఒక్కటే సిద్ధాంతం అని తెలిపారు.తాండూర్ పట్టణాన్ని బాగుచేయలి అనే దృక్పధంతో ముందుకు సాగుతున్నారు.ప్రజలు ఏ ఉద్దేశంతో రోహిత్ రెడ్డిని గెలిపించారో ఆ ఉద్దేశంతో పనులను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు.
అభివృధి అంటే ఒకసారి చేసి వదిలేయడం కాదు,అది ఒక నిరంతర ప్రక్రియ వెనుకబడిన ప్రాంతాన్ని ప్రజల కోరికలకు అనుగుణంగా,ప్రజల అవసరాలను గుర్తిస్తూ, ఎప్పటికప్పుడు కాలంతో పాటు మార్చుకుంటూ ప్రయాణించడమే అభివృద్ధి అని కోరారు.
విమర్శకులకు ధన్యవాదాలు కాని మంత్రదండంతో రాత్రికి రాత్రి అభివృద్ధి చేయడం సాధ్యం కాదు.ఇక ముందు సమస్యలు ఉండవని కాదు ఉంటాయి మీరు ఇదే విధంగా మా దృష్టికి సోషల్ మీడియా ద్వారా సమస్యలను తీసుకురండి.మద్దతుదారులకు ధన్యవాదాలు ఎవరు ఎంత రెచ్చగొట్టాలని చూసిన ఓపికతో ఎమ్మెల్యే పై నమ్మకంతొ ప్రతి సమస్యను అడగండి.ఈ కార్యక్రమాలలో తెరాస నాయకులు పంజుగుల నర్సిరెడ్డి (రాజన్న),ఉమాశంకర్,బెల్కటుర్ సర్పంచ్ మధన్ మోహన్,కేశవ్ రావు,ఆర్ అండ్ బి (ఎ.ఈ) శరత్,కాంట్రాక్టర్ తరుపు వారు ఉన్నారు మరియు రణు బసప్ప తదితరులు పాల్గొన్నారు.