ప్రాణం ఉన్నంతవరకు పేద ప్రజలకు సేవ చేస్తా
✍️ భావితరాలకు గుర్తుండే విధంగా కొత్తగూడెం అభివృద్ధి చేస్తా
✍️ కొత్తగూడెం మున్సిపాలిటీలోని 31 వార్డ్ లో సిసి రోడ్లకు, డ్రైన్ లకు శంకుస్థాపన
✍️ తెలంగాణలో దళితుల అభ్యున్నత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో పాటుపడుతున్నారు
✍️ దళిత బంధు పథకాన్ని ఇచ్చి దళితుల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్
కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీలోని 31 వార్డ్ లోనీ మరియు 28,29వ వార్డ్ లో 14th ఫైనాన్స్ నిధులు సుమారు 9.00 లక్షలు,31 వార్డ్ లోనీ 14th ఫైనాన్స్ నిధులు సుమారు 18:00 లక్షల రూపాయలతో నిర్మించునున్న సిసి రోడ్లు, డ్రైన్ లకు శంకుస్థాపన చేసిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ భావితరాలకు గుర్తిండి పోయే విధంగా కొత్తగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని,నా జీవితం ప్రజాసేవకే అంకితమని అని తెలిపారు.
కొత్తగూడెం మున్సిపాలిటీలోని 31,15,20,30,29 వార్డులోని ఆర్టిఏ ఆఫీస్ పక్కన, పోస్ట్ ఆఫీస్ సెంటర్, మధుర బస్తి, బర్లి ఫీట్, ఉమెన్స్ కాలేజ్ సందు, రామా టాకీస్ ఏరియా, లోని దళిత బంధు షాపులను ప్రారంభించిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ తెలంగాణ బడుగు బలహీన వర్గాల అని బాగు చేయడమే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం అని అన్నారు ఈ దళిత బంధు పథకం ద్వారా దళితులకు 10 లక్షలు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే వనమా అన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ నవీన్, స్థానిక కౌన్సిలర్ శ్రీ కోలాపురి ధర్మరాజు, పరమేష్ యాదవ్, రుకుమెంధర్ బండారి, బండి నరసింహ, వేముల ప్రసాద్, కోఆప్షన్ సభ్యులు దూడల బుచ్చయ్య, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా,వేముల ప్రసాద్,కోఆప్షన్ సభ్యులు శ్రీమతి కనుకుంట్ల పార్వతి,దిశా కమిటీ సభ్యులు పరంజ్యోతి రావు, మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, బస్తీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.