నిన్న పాకిస్థాన్ పై విజయం...బ్రిటన్ కి ప్రధాని అవ్వడం...అసలైన దీపావళి
* సగర్వాంగా చెప్పుకో ధగ విషయం
* తొలి భారత వ్యక్తి రిషి సునాక్
జాతీయం : ఒకప్పుడు వేరే దేశాల గుప్పిట్లో ఉన్న మనం ఇప్పుడు అగ్ర రాజ్యాల పాలకులు అవుతున్నాం.బ్రిటన్ కు భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ప్రధానమంత్రి,మరియు అగ్ర రాజ్యం అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి వ్యక్తి కమలా హారిస్ ఉన్నారు.భారతీయులందరిని బానిసలుగా చేసిన బ్రిటిష్ దేశానికి ఇప్పుడు భారత్ దేశాన్ని నుండి ప్రధాని కావడం గర్వకారణం.దీపావళి రోజే రిషి ఎన్నిక అవ్వడం మరో విశేషం.నిన్న పాకిస్థాన్ పై విజయం బ్రిటన్ కి ప్రధాని అవ్వడం అసలైన దీపావళి అని సోషల్ మీడియాలో తెగ కామెట్స్ పెడుతున్నారు.
ఫ్యామిలీ నేపథ్యం :
రిషి సునాక్ తండ్రి పేరు యాష్ వీర్ వైద్యుడిగా పని చేసేవారు.తల్లి ఉష ఫార్మసీ షాప్ నిర్వహించేవారు.వీద్దరికి 1980 మే 12న రిషి సునాక్ జన్మించారు. గ్రాండ్ పేరెంట్స్ పంజాబ్ చెందినవారు.వీరు మొదట ఆఫ్రికాలో నివాసం చేస్తున్నారు.అనంతరం అక్కడ నుండి 1960లో యుకె కు వెళ్లి నివాసం చేస్తూనే స్థిరపడ్డారు.ఈయన ఆక్స్ ఫర్డ్ లో ఫిలాసఫీ,పాలిటిక్స్,ఎకనామిక్స్ లో ఎంబిఏ పూర్తి చేశారు.
స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నపుడు ఇన్ఫోసిస్ కో అధ్యక్షులుగా నారాయణమూర్తి కుమార్తె అక్షతతో రిషి సునాక్ కు పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది.నాలుగేళ్ల తర్వాత బెంగళూర్ లో 2009లో వీరి వివాహం పెద్దల ఆశిశులతో వైభవంగా జరిగింది.ప్రస్తుతం వీరికి కూతురులు అనౌక్ష,కృష్ణ ఉన్నారు.ఈ క్రమంలో తన జీవితంలో ఎన్నో అవమానాలు,ఆటంకాలు ఎదుకోవాల్సి వచ్చింది. తుదకు ప్రధాన మంత్రి అవడానికి గర్వాంగా ఉంది అన్నారు.ఆయనకు 171 మంది పార్టీ సభ్యులు మద్దతు పలికారు.దీంతో ఆ చేపట్టనున్న తొలి భారత వ్యక్తి సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు.