Type Here to Get Search Results !

Sports Ad

కిడ్నీల్లో రాళ్లు రాకుండా జాగ్రత్తలు Prevents kidney stones

 

కిడ్నీల్లో రాళ్లు రాకుండా జాగ్రత్తలు

మూత్రపిండాల్లో వచ్చే రాళ్ల వల్ల ధీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అందుకే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండేందుకు అవసరమయిన చిన్న జాగ్రత్తలు పాటిస్తుంటే ఎంతో పెద్ద ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉంది.

 జాగ్రత్తలు తీసుకోవలసినవి :

* నీటిని ఎక్కువగా తాగాలి. రోజుకు తప్పనిసరిగా రెండు నుంచి రెండున్నర లీటర్లు యూరిన్విసర్జించాలి. కాబట్టి శరీరం కణాల నిర్వహణకు పోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది.

* ఆహారంలో ప్రోటీన్, నైట్రోజన్, సోడియం ఉన్న పదార్థలను తక్కువగా తీసుకోవాలి. ఆక్సిలేట్ ఎక్కువగా ఉండే గింజలు, సొయాబిన్స్, పాలకూర, చాకెట్ల వంటి వాటిని వీలైనంతగా తగ్గించాలి.

* క్యాల్షీయం సెప్లిమెన్ట్లను కూడా తగ్గిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. అలాగే క్యాల్షీయం సైట్రేట్ క్ కిడ్నీలో రాళ్లు ఆ మేరకు అవి శరీరానికి అందేలా ఆహార నియమాలను పాటించడం మంచిది.

* ఆల్కహాల్ వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దీంతో దేహంలో నీటి శాతం తగ్గిపోయి డీ హైడ్రేషన్ ఏర్పడుతుంది. ఫలితంగా క్రమేణ మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పాడటానికి అవకాశం ఎక్కువ.

* ఆరెంజ్ జ్యూస్ కు, క్యాలిషియం ఆక్సలేట్ను రాయిగా మారకుండా నిరోధించే లక్షణం ఉంది. కాబట్టి ఆరెంజ్ జ్యూస్ మంచిదే. అయితే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం కూడా కిడ్నీస్టోన్ సమస్యకు దారి తీసే అవకాశం ఉంది

కాబట్టి పుల్లటి పండ్లతో చేసిన జ్యూస్ లను ఎక్కువ తీసుకోకూడదు. కూల్ డ్రింక్లను అస్సలు తాగకూడదు. కాఫీలోని కేఫిన్ అనే పదార్థం మూత్రంలోని క్యాల్సియం విసర్జనకు దోహాదం చేస్తుంది. కాబట్టి తగిన మూతదులో తీసుకోవడం ద్వారా కిడ్నీ స్టోన్స్ ని నివారించవచ్చని కొన్ని పరిశీలనలు వెల్లడించాయి.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies