తెలంగాణ తొలి ఉద్యమంలో... అమరజీవి రామచందర్ తల్లి గారిని ఆదరించిన నాయకులు
కొత్తగూడెం : ప్రత్యేక తెలంగాణ తొలి ఉద్యమంలో యువకిశోరం లా పోరాడి అసువులు బాసి అమరుడైన అమరజీవి స్వర్గీయ రామ్ చందర్ కుటుంబాన్ని దర్శించి పరామర్శించి వ్యాధిగ్రస్తు రాలైన అమరజీవి రామచందర్ తల్లి గారిని ఓదార్చి ఆదరించి ఘన పరచి తన తెలంగాణ భక్తిని చాటుకున్న సింగరేణి జనరల్ మేనేజర్ పర్సనల్ శ్రీ అందెల ఆనందరావు ఆచార్య డాక్టర్ మద్దెల శివ కుమార్ నేతృత్వంలో గృహ సందర్శన కార్యక్రమం. ప్రత్యేక తెలంగాణ తొలి ఉద్యమంలో యువకిశోరం లా విజృంభించి పోలీసు కాల్పుల్లో అసువులు బాసి అమరుడైన స్వర్గీయ రామ్ చందర్ ఎంతో ధన్యజీవి !సింగరేణి జనరల్ మేనేజర్ పర్సనల్ శ్రీ అందెల ఆనందరావు ప్రత్యేక తెలంగాణ తొలి ఉద్యమం 19 69 లో మన కొత్తగూడెం లోనే మొదలవడం మన కొత్తగూడెం మరియు మన జిల్లా యొక్క అదృష్టమని ఆ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో యువ కిశోరాలు ల విజృంభించి పోరాడి పోలీసు కాల్పుల్లో అసువులు బాసిన అమరుల యిన స్వర్గీయ దస్తగిరి రామ్ చందర్ లు ధన్య జీవు లని వారిని కన్న తల్లిదండ్రులు ఎంతో పుణ్యదంపతులు అని సింగరేణి జనరల్ మేనేజర్ పర్సనల్
శ్రీ అందెల ఆనందరావు ఉద్ఘాటించారు.
20.10.2022 నాడు రాత్రి ఆచార్య డాక్టర్ మద్దెల శివ కుమార్ నేతృత్వంలో కూలీ లైన్ లోని అమరజీవి స్వర్గీయ రామచందర్ గృహానికి వెళ్లి వ్యాధిగ్రస్తు రాలైన శ్రీమతి శాంతమ్మ ను మరియు స్వర్గీయ రామ్ చందర్ సోదరుడు మరియు సింగరేణి ఉద్యోగి అయిన సంజయ్ ను మరియు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చాడు.ఈ సందర్భంగా శ్రీ ఆనందరావు శ్రీమతి శాంతమ్మ గారి తో మాట్లాడుతూ తాను కూడా బాల్య దశ నుండే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో జెండా పట్టుకొని ఉద్యమించా న ని తన తండ్రి కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు అని స్వర్గీయ రామచందర్ దస్తగిరి లాంటి ఎందరో అమరవీరుల త్యాగ ఫలమే నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమని గాద్ గది క స్వరంతో అన్నారు.తాను జనరల్ మేనేజర్ అయినాక ప్రతిపాదించి ప్రతి సంవత్సరం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున స్వర్గీయ దస్తగిరి స్వర్గీయ రామచందర్ కుటుంబాలకు సింగరేణి నుండి రూపాయలు 10000 పరిహారంగా అందిస్తున్నామని హర్ష ధ్వానాల మధ్య సెలవిచ్చారు.శ్రీమతి శాంతమ్మ గారికి నూతన వస్త్రాలను స్వీట్లను పండ్లను అందించారు తెలంగాణపై తమకున్న మమకారాన్ని భక్తిని చాటుకున్నారు.
వృద్ధురాలు మరియు వ్యాధిగ్రస్తు రాలైన శ్రీమతి శాంతమ్మ మాట్లాడుతూ తన భర్త గారు అయిన కొమరయ్య గారు కూడా ప్రత్యేక తెలంగాణ తొలి ఉద్యమంలోనూ మ లిఉద్యమంలోనూ క్రియాశీలక పాత్ర వహించా డని తన కుమారుడు అయితే ఆ మహాయజ్ఞంలో అసువులు బాసి అమరుడై సమిధగ మిగిలాడు అని కన్నీరు కార్చారు.ఇంత కాలమైనా ఈ దీన కుటుంబాన్ని గుర్తుంచుకొని సింగరేణిలో ఉన్నత అధికారి అయి ఉండి కూడా శ్రీ ఆనందరావు ప్రత్యేకంగా మా కుటుంబాన్ని దర్శించి ఓదార్చి ఆదరించి తన ఔన త్యాన్ని చాటు కు న్నారు అని ఆనంద భాష్పాలు రాల్చారు.
ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ ఆరు దశాబ్దాలుగా ఆంధ్ర పెత్తందా రీ తనానికి
దోపిడీకి తిరుగుబాటు చేసి సుదీర్ఘ కాలం ఉద్యమించి ఎందరో అమరవీరుల త్యాగాలను ఫణంగా పెట్టి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఆంధ్ర దుర్మార్గుల పెత్తందారీ తనమే నడుస్తున్నదని ముఖ్యంగా సింగరేణి కాలరీస్ లో ఆంధ్ర అధికారులు ఇంకా అరాచకాలు చేస్తూ తెలంగాణ అధికారులను కార్మికులను బానిసలుగా భావిస్తూ వేధిస్తూ కుట్రలు పన్నుతున్నారని ఆంధ్ర అధికారుల ఆగడాలను అంతమొందించడానికి అతి త్వరలో తెలంగాణ భావజాలం భావసారూప్యత గల అందరినీ కలుపుకొని ఉవెత్తున ఉద్యమించి తరిమి తరిమి కొడదామని ఖబర్దార్!!! అంటూ హెచ్చరించారు.
చివరగా ఈ కుటుంబానికి భవిష్యత్తులో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సింగరేణి యాజమాన్యం తరపున తాను అండగా ఉంటానని శ్రీ ఆనందరావు హామీ ఇచ్చారు.అనంతరం శ్రీమతి శాంతమ్మ సంజయ్ లు శ్రీ ఆనందరావు ను పూలమాలలతో దుశ్శాలువతో సత్కరించారు.ఈ ఆత్మీయ కార్యక్రమంలో సింగరేణి జనరల్ మేనేజర్ పర్సనల్ అండ్ ఐ ఆర్ పి ఎం శ్రీ అందెల ఆనందరావు కవి సినీ గీతరచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివ కుమార్ సింగరేణి ఏరియా లైజన్ ఆఫీసర్ శ్రీ కలవల చంద్రశేఖర్ సింగరేణి ఎస్సీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అంతోటి నాగేశ్వరరావు సభ్యులు బందెల విజేందర్ సుమన్ దైవ సువార్తికులు బ్రదర్ కే దాసి పీటర్ బాబు బేతనియ సంఘ పెద్ద బ్రదర్ కే దాసి సామ్యుల్ విజయరాజ్ శ్రీమతి శాంతమ్మ సంజయ్ శ్రీమతి ప్రశాంతి సంజయ్ కుమార్తె ఆని కుమారుడురూని కుటుంబ సభ్యులు కిరణ్ సుమన్ ఆదర్శ్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.