Type Here to Get Search Results !

Sports Ad

అయ్యా కెసిఆర్ దొరగారు కనికరిస్తారా కాటేస్తారా VRA In Basheerabad

 

అయ్యా కెసిఆర్ దొరగారు కనికరిస్తారా...కాటేస్తారా !!

* బషీరాబాద్ లో వీఆర్ఏల ఆగ్రహం 
* తహసీల్దార్ కార్యాలయం ముందు దిగ్బధం 
* తహసీల్దార్ కార్యాలయనికి తాళలు వేసి 

బషీరాబాద్ : బషీరాబాద్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు సోమవారం రోజున వీఆర్ఏలు తహసీల్దార్ కార్యాలయం ముందు దిగ్బంధం చేశారు.వీఆర్ఏల సంఘము అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ మా యొక్క డిమాండ్స్ నెరవెర్చే వరకు మేము నీహారదీక్ష కొనసాగిస్తాము.రాష్ట్ర సంఘం నాయకులకు గత నెల 13వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీ ప్రకారం నన్ను నమ్మాండి మీకు నమ్మకం ద్రోహం చెయ్యను నా మాట నమ్మాండి అని సంఘము నాయకులకు తెలిపారు.పేస్కెల్ అమలు చేయాలి అర్హులు అయినా వారికి ప్రమోషన్లు ఇవ్వాలి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగలుగా గుర్తించాలి.ఇప్పటి వరకు ఈ సమ్మె 78 రోజులకు చేరుకుంది.ఇప్పటికే కొంత మంది వీఆర్ఏలు చనిపోవడం జరిగింది.

ప్రభుత్వం ఇప్పటికయినా కళ్ళు తెరవాలి లేనిచో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తాము.ఇప్పటి వరకు జీతాలు లేక భార్య పిల్లలతో సతమతమవుతున్నారు.సోమవారం రెండు గంటలపాటు తహసీల్దార్ కార్యాలయంలో దిగ్బంధం చేశారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం అధ్యక్షులు అంజయ్య,ఉపాధ్యక్షులు నరసింహ,గౌరవ అధ్యక్షులు శరణప్ప, ప్రధాన కార్యదర్శలు శ్రీశైలం,కోశాధి కారి హైమత్ శరణప్ప,నరసమ్మ,వెంకటప్ప, హనుమంతు,రమేష్,ఎలప్ప,కిష్టప్ప,అంజయ్య,శివప్ప,అశోక్,శరణప్ప,రాజమణి,బిచప్ప తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies