పంటలకు పశువుల ఎరువులు మంచిది పట్నం సునీతారెడ్డి
శంషాబాద్ : సేంద్రీయ సాగుతో మంచి పోషకాల పంటలు వస్తాయని జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి అన్నారు.పంటలకు,పొలంలో మందులు వాడకం వలన ఆకుకూరలు,కూరగాయలు,పండ్లు,ధాన్యం గింజల్లో పోషక విలువలు తగ్గిపోతున్నాయని అన్నారు ఆకుకూరలు,కూరగాయల సాగును పరిశీలించారు. అయితే పంట దిగుబడి తక్కువ వచ్చిన మార్కెట్లో ఆర్గానిక్ ద్వారా పండించిన పంటలకు మంచి డిమాండ్ ఉందని చెప్పారు. రైతులు పథకాలంలో సాగుచేసినట్లు పశువుల ఎరువులతో పంటలు సాగుచేయాలని సూచించారు.మంగళవారం రోజున శంషాబాద్ మండలం మల్కారం దగ్గర ఓ ఫామ్ లో సేంద్రీయ పద్దతిలో సాగువహిస్తున్న ఆకుకూరలు, కూరగాయల సాగును పరిశీలించారు.ఆర్గానిక్ సాగులో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో బొంరాస్ పేట జడ్పిటీసీ అరుణదేశాయ్,శంకేరాల్,చక్రపాణి,శాస్త్రి,మురళి కృష్ణ, విజయ్ కుమార్ పాల్గొన్నారు.