వర్షిత అంత్యక్రియలకు హాజరైన జడ్పిచైర్ పర్సన్ సునీతారెడ్డి
* అనారోగ్యంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి
* భవిష్యత్తులో బాగుండాలని తల్లిదండ్రుల ఆలోచన
కోటపల్లి : అనారోగ్యంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి చెందిన ఘటన బార్వాద్ గ్రామంలో చోటు చేసుకుంది.పిల్లల చదువుల కోసం,భవిష్యత్తులో బాగుండాలని తల్లిదండ్రులు ఎంతటి కష్టంమైన చేసి చదివిస్తారు.చేసిన కష్టానికి తల్లిదండ్రులకు దుఃఖమే మిగిలింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా కోట్ పల్లి మండలం బార్వాద్ గ్రామానికి చెందిన డాకూరి రాచిరెడ్డి,అనిత కూతురు వర్షిత సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ కొంత కాలంగా అనారోగ్యంగురై శుక్రవారం రోజున మృతి చెందింది.ఈ విషయం తెలుసుకున్న జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి శనివారం రోజున బార్వాద్ గ్రామం చేరుకొని 3 కి.మీ కాలినడకన నడిచి వర్షిత అంత్యక్రియలకు హాజరయ్యారు. పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన వర్షిత అమ్మ, నాన్న అనిత రాచిరెడ్డిలను పరమార్శించి ఓదార్చారు. అంత్యక్రియల్లో ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి,కోటపల్లి సర్పంచ్ విజయ లక్ష్మి,తదితరుల నాయకులు పాల్గొన్నారు.