సుందరమైన నగరంలా మార్చడమే ఎమ్యెల్యే ధ్యేయం
తాండూర్ : తాండూర్ పట్టణంలో గౌతపుర్ నుండి కరణ్ కోట్ వరకు మొదలైన మట్టి (మొరం) పనులను పరిశీలించిన తెరాస నాయకులు పంజుగుల నర్సిరెడ్డి (రాజన్న) మరియు నాయకులు ఉమా శంకర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు రోడ్ల పనులు ప్రారంభం అయినాయి తాండూర్ పట్టణాన్ని అన్ని రంగంలో అభివృద్ధి చేయడమే ఎమ్యెల్యే పైలట్ రోహిత్ రెడ్డి యొక్క లక్ష్యం అని తెలిపారు.పనులు ఆగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు విజ్ఞప్తి చేశారు.ప్రజలకు సహాయకరంగా ఉన్న ఎమ్యెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రజాస్వామ్యంలో ఆదివాసి నాయకులకు లేదా ?
పాల్వంచ : సభ్యత సంస్కారం లేని పాల్వంచ రేంజర్ అనిల్ కుమార్.పాల్వంచ ఫారెస్ట్(ROFR) బౌండరీ శ్రీనివాస కాలనీ నుండి సీతారాంపురం వరకూ అవగాహన లేని పాల్వంచ రేంజర్ అనిల్ కుమార్.
పాల్వంచ రేంజర్ అనిల్ కుమార్ గారికి ఆదివాసి నాయకులు అంటే అంత చులకన ఎందుకు.సీతారాంపురం యందు గల ఆర్ఓయఫ్ఆర్ భూమిని భూ అక్రమ దారులు కబ్జా చేసి కార్పొరేట్ వ్యవసాయం సాగు చేస్తే ఆపని,
అటవీ హక్కుల చట్టం పరిధిలోని ఫారెస్ట్ భూమిని ఆదివాసులు సాగు చేస్తే ఆపుతారా ?
ప్రత్యక్షంగా భూఅక్రమ దారులు,ఇన్ని రోజులు భూకబ్జాదారులు సాగు చేస్తుంటే హద్దులు కనిపించలేదా ఫారెస్ట్ అధికారులకు.పాల్వంచ రేంజర్ అనిల్ కుమార్ పై పలు అనుమానాలు వ్యక్తం చేసిన ఆదివాసి నాయకులు.సామరస్యంగా మాట్లాడదామని ఆఫీస్ కు వెళ్తే అవమానించి గెంటేసిన పాల్వంచ రేంజర్ అనిల్ కుమార్.
ప్రజాస్వామ్యంలో ఆదివాసి నాయకులకు లేదా...
తక్షణమే అర్హులైన ఆదివాసులకి ఇళ్ల స్థలాలు కేటాయించాలి.
కనీసం మాట్లాడే హక్కు ఈ ప్రజాస్వామ్యంలో ఆదివాసి నాయకులకు లేదా అని ప్రశ్నించారు .దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే పాల్వంచ రేంజర్ అనిల్ కుమార్ ఆదివాసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి.భూకబ్జాదారుల సాగును ఎందుకు ప్రశ్నించ లేదు అని రేంజర్ ని ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెబుతున్నారు.మీడియా మిత్రులు ప్రముఖులు, అశ్వరావుపేట ఎమ్మెల్యే కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేకాంతరావు జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య మరియు న్యాయనిపుణులు దయచేసి ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు వచ్చేంతవరకు సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాం.