Type Here to Get Search Results !

Sports Ad

గోరం,ఆడపిల్ల పుడుతుంది... విషం త్రాగిపించిన భర్త Baby girl born poisoned husband

 

గోరం,ఆడపిల్ల పుడుతుంది... విషం త్రాగిపించిన భర్త

* ఆడపిల్ల వద్దు అనుకున్నపుడు కట్టుకున్న భార్య ఎందుకు 
* 6 నెలల గర్భిణికి రెండవ ప్రసవంలో
* లింగనిర్ధారణ పరీక్షలు చెట్టవిరుద్ధం 

ఆంధ్ర ప్రదేశ్ : ఆడపిల్ల పుడితే ఇంటికి లక్ష్మి వచ్చినది అని సంబరపడి ఈ రోజుల్లో ఆడపిల్లలు ఆర్ధిక స్వతంత్రం సాధిస్తున్నారు.భూమి నుండి అంతరిక్షం వరకు వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.మగవాళ్లకు మేము తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీలను నడుపుతున్న నారీమణులు ఉన్నారు.అలంటి ఈ రోజుల్లోనూ ఆడపిల్ల పుడుతుందని విషమిచ్చి చంపే నీచులు కూడా ఉన్నారు.వివరాల్లోకి వెళ్తే ఆంద్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది 6 నెలల గర్భిణికి రెండవ ప్రసవంలో కూడా ఆడపిల్ల అనే కారణంతో అత్తింటి వారి కోడలికి విషం ఇచ్చారు.ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.బలికురవ మండలం కుపరపలేనికి చెందిన శ్రావణికి రొంపిచర్ల మండలం సభయపాలెం చెందిన గడిపర్తి వేణుతో మూడేళ్ళ క్రితం పెళ్లైంది.వీరిరువురికి మొదటి సంతానంగా ఆడపిల్లకి జన్మించింది.

శ్రావణి రెండోసారి గర్భం దాల్చింది.ప్రస్తుతం 6 నెలల గర్భిణీ ఉన్న శ్రావణిని ఆమె భర్త ఆతని కుటుంభ సభ్యులు నరసరావుపేట్టలోని ఏసీయాన్ హాస్పిటల్ చికిత్స నిమిత్తం తీసుకువెళ్లి స్కానింగ్ చేయించారు.ఐతే లింగనిర్ధారణ పరీక్షలు చెట్టవిరుద్ధమైన అక్కడి సిబంది భర్తకు చెప్పేసారు.దీంతో రెండో సరి కూడా ఆడపిల్ల పుడుతుందనే నెపంత అతింటివారు శ్రావణికి విషమిచ్చారు.అయితే విషయం ఆనోటా ఈనోటా మీడియాకు చేరడంతో ఆస్పత్రికి వెళ్లి చిత్రీకరించేందుకు యత్నించంగా దురుసుగా ప్రవర్తించారు.ఐతే లింగనిర్ధారణ పరీక్షలు చెట్టవిరుదామని తెలిసిన ఏసీయాన్ ఆస్పత్రి సిబంది ఎందుకు చెప్పారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విషయం తెలుసుకున్న జిల్లా వైద్య శాఖ అధికారులు ఏసీయాన్ ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies