బీజేపీ ఖతం...బీఆర్ఎస్ గెలుపు
* బిజెపి కుతంత్రాలను మునుగోడు ప్రజలు తిప్పి కొట్టారు
బషీరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ (BRS)పార్టీ గెలవడంతో రాష్ట్రంలో సంబరాలు జరుకున్నారు. బషీరాబాద్ మండల కేంద్రంలో మన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి బాబాయ్ పి.మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బిజెపి పార్టీకి తగిన గుణపాఠం చెప్పారు. టిఆర్ఎస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలకు కేసీఆర్ గారి వెంబడి మేము ఉన్నాము అని మునుగోడు ప్రజలు ఈరోజు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించడం జరిగింది. బిజెపి పార్టీ కుతంత్రాలను మునుగోడు ప్రజలు తిప్పి కొట్టారు . బిజెపి పార్టీ అరాచకం చేస్తూ ఎమ్మెల్యేలను కొనాలి అనే ఆలోచనతో కుట్రలు పన్నిన నేపథ్యాన్ని తిప్పి కొట్టారు మన తాండూర్ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి గారు. ఈ ఎమ్మెల్యేలకు మా తెలంగాణ ప్రజల తరఫున యావత్తు టిఆర్ఎస్ పార్టీకి సపోర్టుగా ఉన్నామని ఈ ఎన్నికల యొక్క గెలుపు నిర్ణయించింది కావున ఎప్పటికీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తారు అనేదానికి ఇదొక నిదర్శనం.
కొర్విచెడ్ గ్రామంలో కేట్ చేసిన కార్యకర్తలు
బిజెపి పార్టీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం.టిఆర్ఎస్ పార్టీ గెలిచినందుకు టపాసులు కాల్చి ,స్వీట్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవీందర్ సింగ్ తన్వర్ గారు,ఎంపిటిసి పవన్ ఠాకూర్ గారు, మండల యూత్ ప్రెసిడెంట్ తాహేర్ బాండ్, వార్డ్ మెంబర్ రాజన్న,వార్డ్ మెంబెర్ సిద్దార్థ ,వార్డ్ మెంబర్ మహిముద్ ,శేఖర్,యువ నాయకులు రాజు,అదిల్,నరేందర్,యూనుస్,హరీష్ ప్రసాద్,రఘు,అఖిఫ్ సోను,సమీర్,పిఏసిఎస్ నవీన్,యువనాయకుడు మారుతీ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు.
మోనుగొడులో ప్రజల గెలుపు
తాండూర్ : తాండూర్ పట్టణంలో బీజేపీ యొక్క అహంకారం పై మోనుగొడు ప్రజలు నేడు ఓట్లు ద్వారా మేము తెలంగాణ ప్రజలు, మన నేత కేసీఆర్ అని తీర్మానం ఇచ్చిన మోనుగొడు ప్రజలు.నేడు తాండూరు పట్టణం లో అంబెడ్కర్ చౌక్ వద్ద పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్ఫు ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.నేడు తెలంగాణ రాష్ట్ర యొక్క సంక్షేమ పథకాలు నేడు టీఆరెస్ పార్టీ ని గెలిపించింది అని తెలియజేశారు.ఎన్నో విమర్శలు చేసిన, ఎన్ని అడ్డంకులు వచ్చిన, ఎమ్మెల్యేలకు కొనుగోలు చేసే ప్రత్యానం చేసిన, ప్రజలు ఎల్లప్పుడూ కేసీఆర్ వెంటే ఉంటామని స్పష్టం చేసిన మోనుగొడు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.